Unique Tradition: వింత ఆచారం… ఊరంతా మెచ్చేలా పెళ్లి.. వధువరులు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మారు మూల గ్రామాలు ఆచారాల వ్యవహారాలకు పెట్టింది పేరు. తరతరాల సంప్రదాయాన్ని పాటిస్తూ వినూత్నంగా నిలుస్తారు ఈ గ్రామాల ప్రజలు. అలాంటిదే కొమురంభీం జిల్లా కౌటాలలో అనాదిగా సాగుతూ వస్తున్న ఆచారం బొమ్మల పెళ్లి. పిల్లల ఆనందం కోసం ఏదో బొమ్మలకు తూతూ మంత్రంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం కాదు.. నిజంగా పెళ్లి తంతు ఎంత అట్టహాసంగా జరుగుతుందో అదే తీరున బొమ్మల పెళ్లి చేస్తారు ఈ గ్రామాల ప్రజలు.
అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మారు మూల గ్రామాలు ఆచారాల వ్యవహారాలకు పెట్టింది పేరు. తరతరాల సంప్రదాయాన్ని పాటిస్తూ వినూత్నంగా నిలుస్తారు ఈ గ్రామాల ప్రజలు. అలాంటిదే కొమురంభీం జిల్లా కౌటాలలో అనాదిగా సాగుతూ వస్తున్న ఆచారం బొమ్మల పెళ్లి. పిల్లల ఆనందం కోసం ఏదో బొమ్మలకు తూతూ మంత్రంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం కాదు.. నిజంగా పెళ్లి తంతు ఎంత అట్టహాసంగా జరుగుతుందో అదే తీరున బొమ్మల పెళ్లి చేస్తారు ఈ గ్రామాల ప్రజలు. ఒక్కసారి అటు వైపు లుక్కేద్దాం పదండి.
కొమురంభీం జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో అట్టహాసంగా బొమ్మల పెళ్ళి జరిగింది. ఊర్లో అందరు బాగుండాలి, ఎలాంటి రోగాలు రావద్దని, పంటలు బాగాపండాలని, ఊరంతా సుఖశాంతులతో ఉండాలని.. ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలసిమెలసి ఉండాలనే సంకల్పంతో ఊరిలోని పిల్లలందరూ తలో ఇంత చందాలు వేసుకుని ఈ బొమ్మల పెళ్ళిని చేశారు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మలకు పెళ్లి చేయడం కాకుండా, బాజా భంజాత్రీలతో, విందు వినోదాలతో ఘనంగా బొమ్మలకు పెళ్లి తంతు జరిపించారు. ఈ బొమ్మల పెళ్ళికి పెద్దలు కూడా తోడవడంతో వివాహ వేడుక సంబరాలు అంబరాన్నంటాయి.
బాజా బజంత్రులతో పెళ్ళి చేశారు, బొమ్మలకు వివాహం అనంతరం విందు భోజనాలు పెట్టారు. మ్యూజిక్ పెట్టి డ్యాన్స్‌లు చేశారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ఇలా తాటిపల్లి గ్రామంలో బొమ్మలకు పెళ్ళి చేస్తున్నారట. ఎలాంటి రోగాలు రాకూడదని పంటలు బాగా పండాలని సుఖ సంతోషాలతో ఉండాలని చిన్నారులు, పెద్దలు కలిసి ఇలా బొమ్మలకు పెళ్లి చేశారు .ప్రతి సంవత్సరం మే నెలలో ఈ బొమ్మల పెళ్ళి చేస్తామని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికీ చాలా మంచి జరిగిందని పడిపంటలు పండుతున్నాయని, ఇలా ఊరు బాగు కోసం బొమ్మల పెళ్ళిలు చేయడం చాల ఆనందంగా ఉందన్నారు పిల్లలు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…