6th Phase Polling: హస్తినలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. పోలింగ్ కేంద్రాల్లో మొదటిసారిగా పారా మెడికల్ స్టాఫ్!

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి దగ్గరలో ఉన్నాయి. 6వ విడత పోలింగ్ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 25 (శనివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం గం. 7.00 కు ప్రారంభమై సాయంత్రం గం. 6.00కు ముగియనుంది.

6th Phase Polling: హస్తినలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. పోలింగ్ కేంద్రాల్లో మొదటిసారిగా పారా మెడికల్ స్టాఫ్!
Paramedical Staff In Polling Station
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 24, 2024 | 11:45 AM

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి దగ్గరలో ఉన్నాయి. 6వ విడత పోలింగ్ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 25 (శనివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం గం. 7.00 కు ప్రారంభమై సాయంత్రం గం. 6.00కు ముగియనుంది.

అయితే ఈ ఎన్నికలను భానుడు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు అందరి దృష్టి ఈ విడతలో పోలింగ్ జరుపుకోనున్న దేశ రాజధాని నగరం ఢిల్లీపైనే ఉంది. ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారి (CEO) పి. కృష్ణమూర్తి, తెలుగు ఐఏఎస్ అధికారి కావడం మరో విశేషం. హీట్ వేవ్ సహా ఎన్నికల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై ఆయన టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మ కొడియార్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మిగతా మెట్రో నగరాల కంటే ఢిల్లీ బెటర్

పూర్తిగా పట్టణ ప్రాంతంలో నిండిన రాష్ట్రం ఢిల్లీ. ఇక్కడ 7 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఢిల్లీలో 2,607 ప్రదేశాల్లో 13,640 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. వాటిలో సుమారు 2,500 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, వల్నరబుల్‌గా గుర్తించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) పి. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని, కానీ ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ ప్రకారం గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని పోలింగ్ స్టేషన్లను క్రిటికల్, వల్నరబుల్‌గా వర్గీకరించినట్టు తెలిపారు. అందుకు తగ్గట్టే సాయుధ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి పోలింగ్ కేంద్రాలున్న చోట పూర్తిస్థాయిలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించామని, ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి సీఈఓ వరకు వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

దేశంలో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై స్పందిస్తూ.. పట్టణ ఓటర్లలో ఎన్నికలపై ఓ రకమైన నిర్లిప్తత ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు తాము సమాజంలోని మహిళలు అన్ని వర్గాలను చేరుకునే ప్రయత్నం చేశామని చెప్పారు. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఢిల్లీలో పోలింగ్ శాతం మెరుగ్గానే ఉంటుందని అన్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం గణాంకాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల్లో పారా మెడికల్ స్టాఫ్

అసలే పట్టణ ప్రాంతం, ఆపై జనం బయటకు వచ్చేందుకు హడలిపోయే స్థాయిలో భానుడి భగభగలు.. ఇది కచ్చితంగా పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కల్పించాల్సిన ప్రాథమిక సదుపాయాల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల క్యూ లైన్లు నీడలో ఉండేలా టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు సురక్షితమైన తాగు నీరు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఢిల్లీలో వాటితో పాటు మరికొన్ని అదనపు సదుపాయాలను కూడా ఈసీ కల్పిస్తోంది. ఢిల్లీ సీఈఓ పి. కృష్ణమూర్తి వెల్లడించిన ప్రకారం.. వాతావరణ శాఖ నుంచి అందిన హీట్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం నీడ కోసం టెంట్లు, ఓటర్లకు చల్లని తాగునీటితో పాటు మొదటిసారిగా ప్రతి పోలింగ్ కేంద్రంలో పారా మెడికల్ స్టాఫ్‌ను కూడా నియమించినట్టు తెలిపారు. వడదెబ్బకు గురయ్యేవారికి అందించాల్సిన అత్యవసర మందులు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

ఢిల్లీలోని పోలింగ్ కేంద్రాలన్నీ పాఠశాలల్లోనే ఉండడంతో ప్రతిచోటా చల్లని తాగునీటి సదుపాయం ఉందని, అయితే హీట్ వేవ్ నుంచి రక్షణ కల్పించడం కోసం క్యూలైన్లో నిల్చున్నవారికి నీటి తుంపరతో కూడిన ఫ్యాన్ల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎండ వేడికి భయపడకుండా ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి జరుగుతున్న ఎన్నికలని, ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని వినియోగించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎండైనా వానైనా వెరవకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి పి. కృష్ణమూర్తితో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మ కొడియార్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి..

ఆరో దశలో ఉన్న ప్రముఖులు వీరే

లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మే 25న, ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో చెరో 8 స్థానాలు, ఒడిశాలో 6 సీట్లు, జార్ఖండ్‌లో 4 సీట్లు, జమ్ము కాశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో…

నియోజకవర్గం అభ్యర్థి
ఈశాన్య ఢిల్లీ మనోజ్ తివారీ (బీజేపీ)
ఈశాన్య ఢిల్లీ కన్హయ్య కుమార్ (కాంగ్రెస్)
సుల్తాన్‌పూర్ మేనకా గాంధీ (బీజేపీ)
కర్నాల్ హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ)
తమ్లుక్ బెంగాల్ అభిజీత్ గంగోపాధ్యాయ (బీజేపీ)
అనంతనాగ్ రాజౌరీ మెహబూబా ముఫ్తీ (PDP)
కురుక్షేత్ర నవీన్ జిందాల్ (బీజేపీ)
గుర్గావ్ రావ్ ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ)
గుర్గావ్ రాజ్ బబ్బర్ (కాంగ్రెస్)
పూరి సంబిత్ పాత్ర (బీజేపీ)
సంబల్పూర్ ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్