Terrifying Video: డ్రైవర్ నిర్లక్ష్యం..! రివర్స్ చేస్తుండగా కారు చక్రాల కింద నలిగిపోయిన వృద్ధుడు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో దారుణం వెలుగు చూసింది. కారు చక్రాల కింద ఓ వృద్ధుడు నలిగిపోయాడు. ఇరుకైన వీధిలో, టయోటా ఫార్చ్యూనర్ వాహనం వెనుక ఉన్న 70 ఏళ్ల వృద్ధుడిపైకి దూసుకెళ్లింది. ఝాన్సీలోని సిప్రి బజార్ ప్రాంతంలో ఇరువైపులా కార్లు పార్క్ చేసిన ఇరుకైన వీధిలో డ్రైవర్ కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Terrifying Video: డ్రైవర్ నిర్లక్ష్యం..! రివర్స్ చేస్తుండగా కారు చక్రాల కింద నలిగిపోయిన వృద్ధుడు
Car Runs Over Old Man
Follow us
Balaraju Goud

|

Updated on: May 24, 2024 | 11:20 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో దారుణం వెలుగు చూసింది. కారు చక్రాల కింద ఓ వృద్ధుడు నలిగిపోయాడు. ఇరుకైన వీధిలో, టయోటా ఫార్చ్యూనర్ వాహనం వెనుక ఉన్న 70 ఏళ్ల వృద్ధుడిపైకి దూసుకెళ్లింది. ఝాన్సీలోని సిప్రి బజార్ ప్రాంతంలో ఇరువైపులా కార్లు పార్క్ చేసిన ఇరుకైన వీధిలో డ్రైవర్ కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

CCTVలో రికార్డ్ అయ్యిన ఈ దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన టొయోటా ఫార్చ్యూనర్ ఒక ఇరుకైన వీధిలో రివర్స్ చేసుకుంటున్నాడు డ్రైవర్. కొన్ని సెకన్ల తర్వాత, రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి SUV కింద పడిపోయాడు. కారు కింద ఓ వ్యక్తి ఉన్నాడని తెలియక డ్రైవర్‌ వాహనాన్ని కొన్ని మీటర్ల మేర వెనక్కి తిప్పాడు. ఇలా పలుమార్లు వెనక్కు ముందుకు కారు తిప్పడంతో చక్రాల కింద ఆ వృ‌ద్ధుడు నలిగిపోయాడు. కారు ఈడ్చుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి వేసిన కేకలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

వీడియో చూడండి..

వీధిలో జనం గుమిగూడడంతో ఫార్చ్యూనర్ డ్రైవర్ వాహనం దిగి, కారు కింద నుంచి వ్యక్తిని బయటకు తీశారు. ఈ సంఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అదే వాహనంలో వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…