Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్‌ విద్యార్ధిని అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమన్యంపై డౌట్! నిరసన చేపట్టిన విద్యార్ధులు

సిద్దికినగర్‌లో నివాసముంటున్న విద్యార్ధిని కారుణ్య గురువారం ఉదయం హాస్టల్‌ గది నేలపై అపస్మార స్థితిలో పడి ఉంది. కారుణ్యను గమనించిన ఆమె స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కారుణ్య మృతి చెందింది. కారుణ్య శరీరంపై గాయాలు ఉండటంతో విద్యార్ధి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారని స్థానికులు..

Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్‌ విద్యార్ధిని అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమన్యంపై డౌట్! నిరసన చేపట్టిన విద్యార్ధులు
Nursing Student Suspicious Death In Bhadrachalam
Follow us

|

Updated on: May 24, 2024 | 12:20 PM

భద్రాచలం, మే 24: భద్రాచలంలోని మారుతీ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో గురువారం (మే 23) మృతి చెందింది. నర్సింగ్ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న పి కారుణ్య (18) భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సిద్దికినగర్‌లో నివాసముంటున్న విద్యార్ధిని కారుణ్య గురువారం ఉదయం హాస్టల్‌ గది నేలపై అపస్మార స్థితిలో పడి ఉంది. కారుణ్యను గమనించిన ఆమె స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కారుణ్య మృతి చెందింది. కారుణ్య శరీరంపై గాయాలు ఉండటంతో విద్యార్ధి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఓ వ్యక్తి హాస్టల్‌కు వచ్చి కారుణ్యతో గొడవ పడి ఆమెపై దాడి చేసి పారిపోయాడని కొందరు విద్యార్ధులు తెలిపారు. మరోవైపు కారుణ్య బాత్‌రూమ్‌లో జారిపడిందని, దీంతో అంతర్గతంగా గాయాలయ్యాయని నర్సింగ్ కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఇలా పొంతనలేని విధంగా ఎవరికి తోచిన రీతిలో వారు చెబుతుండటంతో నర్సింగ్‌ విద్యార్ధిని కారుణ్య మృతి మిస్టరీగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. విచారణ తర్వాత అసలు కారణం తెలిసే అవకాశం ఉందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరోవైపు శుక్రవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారంతా ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు చేరుకున్నారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles