KTR: ఫేక్‌న్యూస్‌ పెడ్లర్‌.. రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదు.. కేటీఆర్ సంచలన పోస్ట్..

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన ఫేక్‌న్యూస్‌ పెడ్లర్‌ అంటూ విమర్శలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

KTR: ఫేక్‌న్యూస్‌ పెడ్లర్‌.. రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదు.. కేటీఆర్ సంచలన పోస్ట్..
KTR Vs Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2024 | 1:15 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన ఫేక్‌న్యూస్‌ పెడ్లర్‌ అంటూ విమర్శలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి.. తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్‌ వచ్చిందని గతంలో ఆరోపించారన్నారు కేటీఆర్‌, అంతేకాదు గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో సచివాలయంలో నిజాం ఆభరణాల కోసం సొరంగం తవ్వినట్లు కథనాలు సృష్టించారని.. ఆయనో ఫేక్‌న్యూస్‌ పెడ్లర్‌ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేటీఆర్ ఏమని పోస్ట్ చేశారంటే..?

    • రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్‌ వచ్చిందని ఆరోపించారు
    • సచివాలయంలో నిజాం ఆభరణాలు తవ్వినట్లు నకిలీ కథనాలు పుట్టించారు
    • కేంద్రహోంమంత్రి అమిత్‌షా కు సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు
    • ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్‌ సర్క్యులర్‌ పోస్ట్ చేశారు
    • సీఎం హోదాలో ఉండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న రేవంత్‌ని జైలులో ఎందుకు పెట్టకూడదు.. అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

కాగా.. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వరికి బోనస్ తదితర అంశాలే టార్గెట్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శిస్తోంది.. అదే స్పీడులో కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణ అభివృద్ధి గురించి కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీపై విరుచుకుపడుతోంది.. ఈ క్రమంలోనే కేటీఆర్ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్