Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

దేశ వ్యాప్తంగా జూన్‌ 1వ రకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తైన సంగతి తెలిసిందే. ఆరో దశ ఎన్నికలు శనివారం (మే 25) జరగనున్నాయి. ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్ 1 సీటు, జార్ఖండ్ 4 సీట్లు, ఢిల్లీ 7 సీట్లు, ఒడిశా 6 సీట్లు, ఉత్తరప్రదేశ్ 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకుగానూ....

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
Lok Sabha Election 2024 Phase 6
Follow us

|

Updated on: May 24, 2024 | 7:22 AM

న్యూఢిల్లీ, మే 24: దేశ వ్యాప్తంగా జూన్‌ 1వ రకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తైన సంగతి తెలిసిందే. ఆరో దశ ఎన్నికలు శనివారం (మే 25) జరగనున్నాయి. ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్ 1 సీటు, జార్ఖండ్ 4 సీట్లు, ఢిల్లీ 7 సీట్లు, ఒడిశా 6 సీట్లు, ఉత్తరప్రదేశ్ 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకుగానూ.. మొత్తం 889 మంది అభ్యర్ధులు పోటీ చేయనున్నారు. లాజిస్టికల్, కమ్యూనికేషన్ అండ్‌ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా గత నెలలో ఎన్నికల సంఘం (ECI) జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ తేదీని మే 7 నుంచి మే 25 మార్చింది. ఇక రేపు జరగనున్న ఆరో దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

6వ దశ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 14 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 470, హర్యానాలో 10 నియోజకవర్గాల నుంచి 370 నామినేషన్లు వచ్చాయి. ఈ దశలో ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 15 అని పోల్ బాడీ పేర్కొంది. ఏడు దశల ఎన్నికలు పూర్తైన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

లోక్ సభ 2024 ఆర దశ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల పూర్తి జాబితా ఇదే..

  • ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం) – చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ
  • హర్యానా – అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్
  • ఉత్తర ప్రదేశ్ – సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, డోమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచ్లిషహర్, భదోహి
  • పశ్చిమ బెంగాల్ – తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్
  • జార్ఖండ్ – గిరిడి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్
  • బీహార్ – వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వి చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ (SC), శివన్, మహారాజ్‌గంజ్
  • జమ్మూ & కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) – అనంతనాగ్-రాజౌరి
  • ఒడిశా – భువనేశ్వర్, పూరి, ధెంకనల్, కియోంజర్ (SC), కటక్, సంబల్పూర్

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.