Andhra Pradesh: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. . ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. పిన్నెలి ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో...
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. . ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసేవరకూ అరెస్ట్ వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లి కి ఊరట లభించింది. ఆరో తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ‘టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ తతంగంపై పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యమని ఈసీ నేరుగా ఎలా ఆదేశిస్తారు? పిన్నెల్లి కుటుంసభ్యులను పోలీసులు ఇబ్బందిపెడుతున్నారు’ అని పిన్నెల్లి లాయర్ హైకోర్టు జడ్జీకి వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకూ చర్యలొద్దన్న లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీ భవీంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..