Viral: ఆకాశంలో అద్భుత దృశ్యం.! వీడియో వైరల్..

ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది... సాధారణంగా అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే అయినా అది జిల్లావ్యాప్తంగా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి ఎవరికి వారు తమ వాట్సాప్ స్టేటస్ మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని తమ ఆనందాన్ని స్నేహితులతో షేర్ చేసుకున్నారు.. ఇంతకీ ఏంటా దృశ్యం... ఎందుకు అంత పెద్ద ఎత్తున ప్రజలు దానిని ఆసక్తిగా తిలకించారు?

Viral: ఆకాశంలో అద్భుత దృశ్యం.! వీడియో వైరల్..

|

Updated on: May 23, 2024 | 10:35 PM

ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది… సాధారణంగా అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే అయినా అది జిల్లావ్యాప్తంగా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి ఎవరికి వారు తమ వాట్సాప్ స్టేటస్ మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని తమ ఆనందాన్ని స్నేహితులతో షేర్ చేసుకున్నారు.. ఇంతకీ ఏంటా దృశ్యం… ఎందుకు అంత పెద్ద ఎత్తున ప్రజలు దానిని ఆసక్తిగా తిలకించారు? ఏలూరు జిల్లాలో గత పది పదిహేను రోజులుగా జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది.. వర్షం కురిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనస్సు హరివిల్లులా కనిపిస్తూ జిల్లా వాసులకు కనువిందు చేసింది. ద్వారకాతిరుమల, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం ప్రాంతాలలో ఈ ఇంద్రధనస్సు ఆకాశంలో స్పష్టంగా కనిపించింది.అంతేకాదు ద్వారకాతిరుమలలో చిన వెంకన్న కొలువైన శేషాచల కొండను ఇంద్రధనస్సు గొడుగులా కప్పినట్లుగా సుందర దృశ్యం ఆవిష్కృతమయింది. వర్షం కురిసిన అనంతరం లేదా చిన్న చిరుజల్లులతో ఆకాశం మేఘావృతమై మరో పక్క సూర్య రస్మి నీటి బిందువులలో చొచ్చుకుపోయి వివిధ రంగులుగా విభజిస్తూ ప్రకాశించే విధంగా నీటి బిందువులన్నీ రంగులతో నిండిపోతాయి. సూర్య కాంతి వర్షపు చినుకుల్లో ప్రవేశించినప్పుడు కాంతి యొక్క రంగును బట్టి అది కొద్దిగా భిన్నమైన కోణంలో వేగం తగ్గి వంగి వక్రీభవిస్తుంది. ఇది కాంతిని వివిధ రంగులుగా విభజించి ఇంద్రధనస్సును సృష్టిస్తుంది. సాధారణంగా ఇంద్రధనస్సులో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిమందు, వైలెట్ రంగులు మనకు కనిపిస్తాయి. ఇంద్రధనుస్సును చూసిన ప్రతి ఒక్కరు ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!