Doctorate to Cat: పిల్లికి డాక్టరేట్‌.. ఎక్కడో తెలుసా.?

Doctorate to Cat: పిల్లికి డాక్టరేట్‌.. ఎక్కడో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: May 23, 2024 | 10:31 PM

సాధారణంగా సమాజ సేవకోసం పాటుపడినవారికి గౌరవసూచకంగా డాక్టరేట్‌ ఇచ్చి సత్కరిస్తారు. కానీ అమెరికాలో ఓ యూనివర్శిటీవారు పిల్లికి డాక్టరేట్‌ ప్రకటించారు. అవును, మీరు విన్నది నిజమే.. పిల్లికే.. డాక్టరేటే.. ఇంతకీ ఆ పిల్లిగారు ఏం చేశారు.. కొంపతీసి అమెరికాలోని ఎలుకలన్నింటిని పట్టేసి తన ప్రతిభను చాటిందా? అనే కదా మీ సందేహం..అదేం లేదు.. ఆ పిల్లి యూనివర్శిటీలోని అందరితో స్నేహంగా మెలగుతోందట.

సాధారణంగా సమాజ సేవకోసం పాటుపడినవారికి గౌరవసూచకంగా డాక్టరేట్‌ ఇచ్చి సత్కరిస్తారు. కానీ అమెరికాలో ఓ యూనివర్శిటీవారు పిల్లికి డాక్టరేట్‌ ప్రకటించారు. అవును, మీరు విన్నది నిజమే.. పిల్లికే.. డాక్టరేటే.. ఇంతకీ ఆ పిల్లిగారు ఏం చేశారు.. కొంపతీసి అమెరికాలోని ఎలుకలన్నింటిని పట్టేసి తన ప్రతిభను చాటిందా? అనే కదా మీ సందేహం..అదేం లేదు.. ఆ పిల్లి యూనివర్శిటీలోని అందరితో స్నేహంగా మెలగుతోందట. అందుకే వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా దాన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారట!!ఈ మేరకు మ్యాక్స్ డౌ అనే పిల్లి పేరిట గౌరవ డాక్టరేట్ ను వర్సిటీ పాలక మండలి సభ్యులు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు. వర్సిటీ క్యాంపస్ సమీపంలో నివసించే ఓ కుటుంబం మ్యాక్స్ ను పెంచుకుంటోంది. దానికి బోర్ కొట్టినప్పుడల్లా అలా సరదాగా క్యాంపస్ ను కలియతిరిగి వస్తుందని యజమాని ఆష్లే డౌ తెలిపారు. దాన్ని చూసినప్పుడల్లా విద్యార్థులు ఎంతో ఉత్సాహపడుతుంటారని, పిల్లితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు వారు పోటీపడుతుంటారని వివరించారు. ఒక్కోసారి కొందరు విద్యార్థులతో కలసి పిల్లి వెళ్లిపోతుంటుందట. పిల్లితో బాగా అనుబంధం పెంచుకున్న విద్యార్థులు అది ఎప్పుడైనా కనిపించకపోతే పిల్లి ఎలా ఉందంటూ అడుగుతారని తెలిపారు. డిగ్రీ పట్టాల ప్రదానం రోజున పిల్లి పేరుతో గౌరవ డాక్టరేట్ ను వర్సిటీ అధికారులు ఇంటికి పంపినట్లు చెప్పారు. అయితే జంతువులు గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2020లో మూస్ అనే ఎనిమిదేళ్ల కుక్క వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది. వేలాది మంది విద్యార్థులకు వెటర్నరీ వైద్యంలో తోడ్పాటు అందించినందుకు దాన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. అలాగే 2016లో డాక్టర్ టెడ్డీ అనే 16 ఏళ్ల గుర్రానికి సైతం గౌరవ డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా దానికి ఈ డాక్టరేట్ ప్రదానం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.