Iran Conspiracy: అమెరికా పన్నాగమా.? ఇజ్రాయెల్ హస్తముందా.?

Iran Conspiracy: అమెరికా పన్నాగమా.? ఇజ్రాయెల్ హస్తముందా.?

Anil kumar poka

|

Updated on: May 23, 2024 | 10:42 PM

హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని, ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించ లేదని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు.

హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని, ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించ లేదని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్ లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. మరోవైపు అజర్ బైజాన్ కు మూడు హెలికాప్టర్లు వెళ్ళగా ఇరాన్ దేశాద్యక్షుడి రక్షణ కోసం వెళ్ళిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగానే ఉండగా ఇబ్రహీం ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురి కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా..? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌ హస్తం ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా మొసాద్ స్కెచ్ అని కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఇరాన్.. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. డమాస్కస్ లోని తమ దేశ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఉన్నతాధికారులను చంపిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ పై ఈ దాడులకు దిగింది ఇరాన్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడి మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.