PM Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్..?
హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ ఇద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని,
హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ ఇద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, అమాయక పౌరుల మరణాలకు కారణమవుతున్నారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టినట్లు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
యుద్ధ నేరాలకు సంబంధించి నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అంశాన్ని ఐసీసీ జడ్జిల బృందం పరిశీలిస్తోందని, త్వరలో వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ పేర్కొన్నారు. నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్, హమాస్ లీడర్ యహ్యా సిన్వర్, మొహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనీయహ్ లకు వారెంట్ జారీ చేయనుందని తెలిపారు. అయితే, ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ జడ్జిలు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటారని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.