Flying Cars: ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు..
రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్. ఖాళీ లేకుండా నిండా కార్లు, టూవీలర్లు, వాటి మధ్య బస్సులు, ఇతర వాహనాలు. కాసింత దూరం వెళ్లడానికి కూడా అరగంట, గంట సమయం పడుతుంది. అలా కాకుండా నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుంటుంది అనిపించని వారు ఎవరూ ఉండరు. అలా వెళ్లాలనుకుంటే.. ఇదిగో ఈ ఎగిరే కారును కొనేసుకుంటే సరి. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది.
రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్. ఖాళీ లేకుండా నిండా కార్లు, టూవీలర్లు, వాటి మధ్య బస్సులు, ఇతర వాహనాలు. కాసింత దూరం వెళ్లడానికి కూడా అరగంట, గంట సమయం పడుతుంది. అలా కాకుండా నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుంటుంది అనిపించని వారు ఎవరూ ఉండరు. అలా వెళ్లాలనుకుంటే.. ఇదిగో ఈ ఎగిరే కారును కొనేసుకుంటే సరి. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్ తరహాలో కనిపించే ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి.. పది, పన్నెండు మీటర్ల ఎత్తులోకి కారును తీసుకెళ్లి.. అటూ ఇటూ తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు.
ఈ ఎగిరే కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్ని నేల మీదే కాదు.. నీటిలోనూ ల్యాండ్ చేయవచ్చని వివరించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా వాటిని అమర్చారు. మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు. ఈ ఎగిరే కారు రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల దాకా స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. ఇంతకీ దీని ధర 4 కోట్ల రూపాయలు. అయితే ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తే.. అప్పుడు అందిస్తారట. కాకపోతే దీనిలో ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.