AP Leaders: జగన్, చంద్రబాబు, లోకేశ్.. తాజాగా షర్మిల అమెరికాకు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. భార్య భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి అమెరికా వెళ్లారు. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 16నే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ నెల 25, లేదంటే 26న ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. భార్య భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి అమెరికా వెళ్లారు. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 16నే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ నెల 25, లేదంటే 26న ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది.చంద్రబాబు వైద్య పరీక్షల కోసం వెళ్లగా, లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ వెళ్లారు. జగన్ కూడా ఈ నెలాఖరులో తిరిగి ఏపీ చేరుకుంటారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అమెరికా వెళ్లారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అక్కడే ఉన్న తల్లి వైఎస్ విజయమ్మను కలిసేందుకు వెళ్లారు. కుమారుడు, తల్లితో కొంతకాలం గడిపిన తర్వాత తిరిగి జూన్ 2న తల్లితో కలిసి షర్మిల వెనక్కి వస్తారని సమాచారం. రెండుమూడు నెలలుగా ఎన్నికల ప్రచారం, వ్యూహాలతో బిజీబిజీగా గడిపిన వీరంతా ఎన్నికలు ముగిసీ ముగియగానే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అంతకుముందే వీరంతా ఏపీకి చేరుకుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

