Delhi: ఆరోదశ ఎన్నికకు ముగిసిన ప్రచారం.. ఢిల్లీవైపే అందరి చూపు.. కారణం ఇదే..
లోక్ సభ ఆరోదశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మే 25న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఆరో దశలో 869 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ఈసారి అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. హస్తినలో బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించడం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టై బెయిల్‌పై బయటకు రావడం లాంటి అంశాలతో ఢిల్లీలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది.
లోక్ సభ ఆరోదశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మే 25న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఆరో దశలో 869 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ఈసారి అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. హస్తినలో బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించడం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టై బెయిల్‌పై బయటకు రావడం లాంటి అంశాలతో ఢిల్లీలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే కేజ్రీవాల్ మీడియా సమావేశాలు నిర్వహించారు.
మరోవైపు తెలుగోళ్ల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించినప్పటికీ.. అసలు తెలుగోళ్లు ఎవరి వైపు ఉన్నారు.? వారి మద్దతు ఎవరికి అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో లంచ్ చేశారు రాహుల్. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అదానీ, అంబానీల కోసమే మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..