Delhi Election: రాజధాని రాగంలో తెలుగు తాళం.. ఢిల్లీలో తెలుగువాళ్ల ఓట్ల కోసం పార్టీల పాట్లు

ఢిల్లీలో తెలుగు వాళ్ల ఓట్ల కోసం అన్ని పార్టీలు గేలం వేస్తున్నాయి. ఎర వేసి గురి చేసి తెలుగు సెంటిమెంట్‌ను పండిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ నుంచి చిన్నమ్మ డాటర్‌ దాకా...అంతా తెలుగోడికి చెయ్యెత్తి జై కొడుతున్నారు. రాజధాని రాగంలో పార్టీలన్నీ తెలుగు తాళం వేస్తున్నాయి.

Delhi Election: రాజధాని రాగంలో తెలుగు తాళం.. ఢిల్లీలో తెలుగువాళ్ల ఓట్ల కోసం పార్టీల పాట్లు
Voters
Follow us
Balaraju Goud

|

Updated on: May 24, 2024 | 8:27 AM

ఢిల్లీలో తెలుగు వాళ్ల ఓట్ల కోసం అన్ని పార్టీలు గేలం వేస్తున్నాయి. ఎర వేసి గురి చేసి తెలుగు సెంటిమెంట్‌ను పండిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ నుంచి చిన్నమ్మ డాటర్‌ దాకా…అంతా తెలుగోడికి చెయ్యెత్తి జై కొడుతున్నారు. రాజధాని రాగంలో పార్టీలన్నీ తెలుగు తాళం వేస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశ రాజధాని కావడంతో అది మినీ ఇండియాలా ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ల జనాభాతో ఢిల్లీ మహా నగరం కిటకిటలాడుతుంటుంది. ఇక్కడ తెలుగు వాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. దీంతో ఢిల్లీ సమరంలో తెలుగు వాళ్ల ఓట్లు కూడా కీలకంగా మారాయి. మనోళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తెలుగోడికి చెయ్యెత్తి జై కొడుతున్నాయి. ఢిల్లీలో జట్టు కట్టిన కాంగ్రెస్‌, ఆప్ ఓవైపు, బీజేపీ మరోవైపు మోహరించాయి. తెలుగు వాళ్ల ఓట్లను తమ బుట్టలో వేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ భవన్‌లో లంచ్‌ చేశారు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయన్నారు..

రాహుల్‌ ఏపీ భవన్‌ సందర్శన అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే…మీట్‌ అండ్‌ గ్రీట్‌ అంటూ తెలుగువాళ్లను పలకరించారు చిన్నమ్మ సుష్మ స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్. న్యూఢిల్లీ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆమె, తనను గెలిపించాలంటూ తెలుగువాళ్లకు విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నేత మల్లు రవి కూడా…ఇండియా కూటమి కోసం ఢిల్లీలో ప్రచారం చేశారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌కు ఓటు వేయాలంటూ తెలుగువాళ్లను అభ్యర్థించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.

తెలుగు ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలంటూ ఢిల్లీ సీఈవో కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీలో తెలుగువాళ్లు ఏ పార్టీకి చెయ్యెత్తి జై కొడతారో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?