Prajwal Revanna: వెంటనే భారత్ వచ్చి లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని వార్నింగ్!
మహిళలపై లైంగిక దాడుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణకు ఆయన తాత ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ వెంటనే లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని HD దేవెగౌడ ట్విట్టర్ X వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
మహిళలపై లైంగిక దాడుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణకు ఆయన తాత ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ వెంటనే లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని HD దేవెగౌడ ట్విట్టర్ X వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్స్‌లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు.
లైంగిక దాడుల కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. మే నెల 5వ తేదీన ఆయన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ను దేశానికి రప్పించేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, లొంగిపోవాలంటూ ప్రజ్వల్ కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పైవిధంగా స్పందించారు.
ప్రజ్వల్ రేవణ్ణ తనకు, తన కుటుంబానికి, పార్టీకి, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ తీవ్రమైనదని దేవెగౌడ తన లేఖలో రాశారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు. ప్రజ్వల్‌పై నమోదైన కేసులో దోషిగా తేలితే అతనికి కఠినశిక్ష పడాల్సిందే అన్నారు దేవెగౌడ. తన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడని ఆయన తెలిపారు. ప్రజ్వల్.. ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో.. లేదంటే తనతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావు.. అంటూ ఆ లేఖలో దేవెగౌడ హెచ్చరించారు. అంతకుముందు ఈ విషయంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు. తాతపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసులు ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo
— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…