Heatwave: దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్.. ఉత్తరాదిలో సూర్యుడి భగభగలు.. 8మంది మృతి..

ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యలో వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం దొరకగా.. రోహిణి కార్తె ప్రవేశిస్తున్న వేళ మళ్లీ ఎండలు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ చెప్పింది. రాజస్థాన్‌లోని బార్మర్లో గరిష్ట ఉష్ణోగ్రత 48.8° సెల్సియస్ గా నమోదైనట్లు తెలిపింది.

Heatwave: దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్.. ఉత్తరాదిలో సూర్యుడి భగభగలు.. 8మంది మృతి..
Imd Sounds ‘severe Heatwave’ Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2024 | 8:25 AM

ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యలో వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం దొరకగా.. రోహిణి కార్తె ప్రవేశిస్తున్న వేళ మళ్లీ ఎండలు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ చెప్పింది. రాజస్థాన్‌లోని బార్మర్లో గరిష్ట ఉష్ణోగ్రత 48.8° సెల్సియస్ గా నమోదైనట్లు తెలిపింది. ఈ ఎండల తీవ్రతకు దాదాపు 8మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పూట రోడ్లపై వెళ్లే వాహనదారుల మాడు పగిలిపోతోంది. ఈ క్రమంలోనే.. రోడ్లపై ఎండలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు.. జంక్షన్లలో గ్రీన్ మెష్‌లో షెడ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు గ్రీన్ మెష్ వల్ల వచ్చే నీడ.. వాహనదారులకు ఎండ వేడి నుంచి ఒకింత ఉపశమనం దొరుకుతోంది. మరోవైపు కొన్నిచోట్ల రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు.

ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలలో కూడా ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..