CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్, సీఎం రేవంత్ మధ్య కౌంటర్ వార్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాద తీర్మానం తరువాత చేపట్టిన చర్చలో కేటీఆర్ విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సభలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు ప్రజాస్వామ్య స్పూర్తి ముఖ్యం అన్నారు. కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాద తీర్మానం తరువాత చేపట్టిన చర్చలో కేటీఆర్ విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సభలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు ప్రజాస్వామ్య స్పూర్తి ముఖ్యం అన్నారు. కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదన్నారు. 49 శాతాని, 51 శాతానికి తేడా ఉంటుందని గెలిచిన సీట్ల గురించి చెప్పుకొచ్చారు. 51 శాతం వచ్చిన వారికి వంద శాతం ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా విలువ ఉంటుందన్నారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేశారు.
గత పాలకుల గురించి తప్పకుండా మాట్లాడుదామన్నారు. గతంలో పాలన గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చి రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గత పాలనలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పారు. కేకే, మహేందర్ రెడ్డి సీటు గుంజుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
దీనిపై స్పందిస్తూ కేటీఆర్ మరో సారి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలన్నారు. ఎన్నారైలకు టికెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఎన్నారై అంటూ రేవంత్ మాటలకు ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ బలిదేవత ఎవరో అందరికీ తెలుసని.. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. అలాగే ఎన్నారై అన్న పదంపై కేటీఆర్ స్పందిస్తూ.. నాన్ రిలయబుల్ ఇండియన్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో పావు వంతు కూడా అమలు కాలేదు. మార్చి 17 కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుందన్నారు. 100 రోజుల్లో చెప్పిన హామీలు అమలు చేయకుంటే అప్పుడు కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తుచేశారు. బానిసలు పోతే.. బానిసకు ఓ బానిస అన్నట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి భాష మారడం లేదని విమర్శించారు. విద్యుత్ శాఖలో అప్పుల కన్నా ఆస్తులే అధికంగా ఉన్నాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..