Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..!
Crocodile mouth challenge: ఓ వ్యక్తి భయంకరమైన భారీ మొసలితో సహసం చేశాడు. ఆ వ్యక్తి ఏకంగా మొసలి నోట్లోనే తన చేతిని పూర్తిగా పెడతాడు. అలాగే ఉంచుతాడు. ఈ వీడియో చూస్తున్నంత సేపు అందరిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అంత షాకింగ్‌గా ఆ వీడియో ఉంది.

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని సరదాగా ఉంటాయి. ఇంకొన్ని భయం కలిగించే విధంగా ఉంటాయి. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి భయంకరమైన భారీ మొసలితో సహసం చేశాడు. ఆ వ్యక్తి ఏకంగా మొసలి నోట్లోనే తన చేతిని పూర్తిగా పెడతాడు. అలాగే ఉంచుతాడు. ఈ వీడియో చూస్తున్నంత సేపు అందరిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అంత షాకింగ్‌గా ఆ వీడియో ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి మొసలితో చాలా ప్రమాదకరమైన ఆటను ఆడతాడు. ఆ వ్యక్తి నిర్భయంగా భారీ మొసలి నోట్లో తన చేతిని ఉంచుతాడు. వెంటనే తీయకుండా అలాగే ఉంచుతాడు. అయితే, ఆ మొసలి కూడా అతడు చేతిని పెట్టేందుకు వీలుగా నోరు పెద్దగా తెరిచి ఉంచుతుంది. అయితే, మొసళ్లు చాలా దూకుడుగా ఉంటాయి. ఏదైనా తమ నోటి వద్దకు వస్తే వెంటనే వాటిని బలంగా నోటితో పట్టేస్తాయి. ఆ తర్వాత అది ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు.
ఈ మొసలి అన్నింటిలా కాదు..
కానీ, ఈ వీడియోలో కనిపించే మొసలి మాత్రం వాటికి భిన్నంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ వ్యక్తి మొసలి నోట్లో తన చేతిని పెట్టినంతసేపు కూడా నోటిని పెద్దగా తెరిచి ఉంచింది. ఆ వ్యక్తిపై ఎలాంటి దాడి చేయలేదు. దీంతో ఆ వ్యక్తి తన చేతిని మొసలి నోట్లో నుంచి కొంతసేపటి తర్వాత సురక్షితంగా తీసుకోగలిగాడు. చేయి తీసిన తర్వాతనే ఆ మొసలి నోరు మూసుకోవడం విశేషం. అత్యంత ఉత్కంఠను కలిగించే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యకరంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొసలి తన వద్దకు వచ్చిన ఆహారాన్ని ఇలా వదిలివేయడం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఆ వ్యక్తి కూడా ఎలాంటి భయం లేకుండా మొసలి నోట్లో చేయిని ఉంచడం సాహసమేనని చెబుతున్నారు. అయితే, ఆ మొసలికి అలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే, ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దని ఇంకొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది.
