AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ముసలోడి కాని మహానుభావుడు.. ఆ ఒక్క వీడియోతో 3 కోట్ల వ్యూస్.. ఇంతకూ అందులో ఏముందంటే

UP Man First Vlog Goes Viral: ఏజ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే.. నేర్చుకోవాలనే ఆసక్తి.. పట్టుదల ఉంటే అసాద్యాన్ని సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపించారు ఓ 70 ఏళ్ల వృద్దుడు. తన రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక.. సోషల్‌ మీడియా వ్లాగింగ్ స్టార్ట్ చేశారు. ఇలా ఆయన చేసిన తొలి వీడియోకు కేవలం 72 గంట్లోనే 3 కోట్లు వివ్స్ వచ్చాయి. ఇంతకు ఆయన చేసి వీడియో ఏంటి.. దానికి ఎందుకు అన్ని వీవ్స్ వచ్చాయో చూద్దాం పదండి.

Watch: ముసలోడి కాని మహానుభావుడు.. ఆ ఒక్క వీడియోతో 3 కోట్ల వ్యూస్.. ఇంతకూ అందులో ఏముందంటే
Up Man First Vlog Goes Viral
Anand T
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 7:14 PM

Share

ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్‌ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలోనే మునిగిపోతున్నారు. అయితే మరికొందరు సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక స్టంట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం.. ఏ స్టంట్స్ చేయకుండా.. తాను చేసి ఒక్క వీడియోతోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నారు. అవును తన రిటైర్మెంట్ తర్వాత 70 ఏళ్ల వయస్సులో సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన యూపీకి చెందిన వినోద్ కుమార్ శర్మ అనే వ్యక్తి తన ఇన్‌స్టాలో తొలి వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది

70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ పోస్ట్ చేసిన తన ఫస్ట్ వీడియోలో.. ఆయన తనను తాను నెటిజన్లకు పరిచయం చేసుకున్నారు. తనకు వ్లాగింగ్‌ ఏ మాత్రం అనుభవం లేదని.. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలతో తోచక వ్లాగింగ్ ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. ఈ వీడియో నచ్చుతే తనను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్‌ మీడియాను మొత్తం షేక్ చేసింది. కేవలం 72 గంటగటల్లోనే ఆయన వీడియోకు దాదాపు 3మిలియన్ల వరకు లైక్స్ వచ్చాయి. ఆయనకు సపోర్టు చేస్తూ చాలా మంది కామెంట్స్ చేశారు.

వీడియో చూడండి..

వయస్సు అనేది కేవలం మాత్రమే మీతో మేము ఉన్నాము అంకుల్ అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. అంకుల్ జీ, మీరు మా హృదయాలను సంతోషపెట్టారు. మీరు జర్నీని ఇలానే కొనసాగించండి.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని మీరు నిరూపించారని మరో యూజర్ రాసుకొచ్చాడు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. బాగా చెప్పారు తాతయ్య.. మీ వల్ల నేను ఇన్‌స్పైర్ అయ్యానని కామెంట్ చేశాడు. ఈ వీడియో తర్వాత ఆయన ఇన్‌స్టా అకౌంట్‌కు ఏకంగా 64,000 వేల ఫాలోవర్స్ వచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us