CM Revanth Reddy: మాజీ డీఎస్పీ నళిని పోస్టింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా.. సీఎస్‌, డీజీపీకి కీలక ఆదేశాలు

నా అన్నా తమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ' ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తన డీఎస్పీ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశారు దోమకొండ నళిని. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు కూడ కూర్చున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనిపించకుండా పోయారామె

CM Revanth Reddy: మాజీ డీఎస్పీ నళిని పోస్టింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా.. సీఎస్‌, డీజీపీకి కీలక ఆదేశాలు
EX DSP Nalini, CM Revanth Reddy
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2023 | 7:00 AM

‘నా అన్నా తమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ‘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తన డీఎస్పీ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశారు దోమకొండ నళిని. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు కూడ కూర్చున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనిపించకుండా పోయారామె. మళ్లీ ఇప్పుడు నళిని పేరు బాగా వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నళిని పోస్టింగ్‌ విషయంపై స్పందించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం (డిసెంబర్‌ 15) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్‌. ఈ సందర్భంగా నళిని పోస్టింగ్‌ ప్రస్తావనకు రాగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే నళిని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల తాను పోలీస్‌ ఉద్యోగం చేయలేనంటూ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..