Telangana: 500లకే గ్యాస్ సిలిండర్ .. గ్యాస్‌ ఏజెన్సీలకు మహిళల క్యూ.. ఈ కేవైసీ కోసం వద్ద పడిగాపులు

తెలంగాణలో గ్యాస్‌ ఏజెన్సీలకు జనం పోటెత్తుతున్నారు. E KYC కోసం మహిళలు...గ్యాస్‌ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే వీళ్లంతా కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ కోసమా, లేక కేంద్రం ఇచ్చే ఉజ్వల స్కీమ్‌లో భాగంగా ఏజెన్సీలకు పోటెత్తుతున్నారా అనేదానిపై కన్ఫ్యూజన్‌ నెలకొంది

Telangana: 500లకే గ్యాస్ సిలిండర్ .. గ్యాస్‌ ఏజెన్సీలకు మహిళల క్యూ.. ఈ కేవైసీ కోసం వద్ద పడిగాపులు
Gas Cylinders
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2023 | 6:45 AM

ఓవైపు గ్యాస్‌ ఏజెన్సీల ముందు చాంతాడంత క్యూలు..మరోవైపు ఆధార్‌ సెంటర్లలో ఈ-కేవైసీ కోసం హడావుడి. అయితే ఉజ్వల పథకంలో భాగంగా ఈ హల్చల్‌ జరుగుతోందా లేక కాంగ్రెస్‌ గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి గ్యాస్‌ సిలిండర్‌ కోసం జనం పడుతున్న తిప్పలివి. తెలంగాణలో గ్యాస్‌ ఏజెన్సీలకు జనం పోటెత్తుతున్నారు. E KYC కోసం మహిళలు…గ్యాస్‌ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే వీళ్లంతా కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ కోసమా, లేక కేంద్రం ఇచ్చే ఉజ్వల స్కీమ్‌లో భాగంగా ఏజెన్సీలకు పోటెత్తుతున్నారా అనేదానిపై కన్ఫ్యూజన్‌ నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఇండియన్ గ్యాస్ కంపెనీ ఏజెన్సీలో E – KYC కోసం మహిళలు బారులు తీరారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్ సిలెండర్ కలిగిన ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పడంతో వాళ్లంతా ఇలా బారులు తీరారు. మరోవైపు ఆధార్‌ అప్‌డేట్‌ కోసం నాగర్ కర్నూల్‌ జిల్లాలో కూడా జనం నానా తిప్పలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో 8 ఆధార్ కేంద్రాలు ఉండగా..వీటిలో ఏడు పనిచేయడం లేదు. మరోవైపు వరంగల్‌లో కూడా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆధార్‌ కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు. గ్యాస్‌ సిలిండర్ల కోసం ఈ-కేవైసీ అప్‌డేట్‌ కోసం ఆపసోపాలు పడుతున్నారు.

మరోవైపు సచివాలయంలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి…అధికారులతో చర్చించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సివిల్ సప్లయిస్‌ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. అయితే గ్యాస్‌ ఏజెన్సీలకు పోటెత్తుతున్న మహిళలు..ఉజ్వల స్కీమ్‌లో భాగంగా తమ ఈ-కేవైసీని అప్‌డేట్‌ చేస్తున్నారు. అయితే కొందరు అవగాహనా లోపంతో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి కూడా ఈ-కేవైసీపీ ఇవ్వాలని భావించడంతో వాళ్లు కూడా దానికోసం అప్లయ్‌ చేస్తున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..