ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు కేటుగాళ్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిత్యవసర వస్తువులు మొదలుకుని.. చిన్న పిల్లులు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్కోడి ప్రాణానికి ఏమైతేనేం.. మనకు పైసలే ముఖ్యమంటూ ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజాగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

|

Updated on: Dec 15, 2023 | 10:00 PM

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు కేటుగాళ్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిత్యవసర వస్తువులు మొదలుకుని.. చిన్న పిల్లులు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్కోడి ప్రాణానికి ఏమైతేనేం.. మనకు పైసలే ముఖ్యమంటూ ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజాగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆహార కల్తీలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు కావడం గమనార్హం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??

లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు

బిగ్ బాస్‌ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్‌ కళ్లు పోయేవి

Follow us
Latest Articles