లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

Phani CH

|

Updated on: Dec 15, 2023 | 9:57 PM

జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మెడలో నోట్ల దండ వేసి సత్కరించారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అద్యక్షుడు వల్లకొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు సొసైటీలకు చెందిన వారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాను కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్ తీరుపై ఫిర్యాదు చేశారు.

జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మెడలో నోట్ల దండ వేసి సత్కరించారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అద్యక్షుడు వల్లకొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు సొసైటీలకు చెందిన వారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాను కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్ తీరుపై ఫిర్యాదు చేశారు. వివిధ మత్స్యకార సొసైటీలకు సంబంధించి ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇచ్చుకోక తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు అధికారి సహకార సంఘాల డైరెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వేధింపులు భరించలేక డబ్బుల దండలు వేశామని చెబుతున్నారు.. ఈ అధికారి పై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామంటున్నారు. అయితే, మత్స్యకారుల మధ్య గొడవలతోనే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని దేవేందర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు

బిగ్ బాస్‌ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్‌ కళ్లు పోయేవి

Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా

Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్‌ సినిమా ఏమైనట్టు ??