స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని భయాన్ని కలిగిస్తాయి.. అలాగే కొన్ని వీడియోలు నమ్మలేని విధంగా ఉంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు కారును అత్యంత వేగంగా ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తిలా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నామంటూ నోరెళ్లబెడుతున్నారు.

స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

|

Updated on: Dec 15, 2023 | 10:01 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని భయాన్ని కలిగిస్తాయి.. అలాగే కొన్ని వీడియోలు నమ్మలేని విధంగా ఉంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు కారును అత్యంత వేగంగా ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తిలా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నామంటూ నోరెళ్లబెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెద్ద కారు డ్రైవింగ్ సీటులో స్టిరింగ్‌ కూడా సరిగా అందని ఓ పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. ఈ బుడ్డోడు సరదాగా ఆడుకోడానికి అక్కడ కూర్చున్నాడు అనుకుంటే పొరపాటే.. అతను కారు డ్రైవ్‌ చేయడానికి కూర్చున్నాడు.. కూర్చోవడమే కాదు.. నడిపేసాడు కూడా. ఎడారిలాంటి ప్రాంతంలో ఎత్తు పల్లాలలో ఎంతో చాకచక్యంగా బాలుడు కారును నడిపాడు. అదికూడా ఊహించని స్పీడులో. చిన్నారి ధైర్యాన్ని అభినందించాల్సిందే. పిల్లవాడు ఏ మాత్రం భయం లేకుండా కారును ఫుల్ స్పీడ్ గా నడిపాడు. అయితే,ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??

లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు

Follow us
Latest Articles