70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు

చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు భయపెడుతోంది. కర్నాటక సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి..కర్నాటక నుంచి కుప్పంవైపు 70 ఏనుగుల గుంపు తరలిరావడంపై అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పొలాలు, సరిహద్దుప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు..ప్రస్తుతం ఏనుగుల గుంపు కర్నాటక పరిధిలోని కామసముద్రం దగ్గర తిష్ఠ వేసినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి గుడిపల్లి మండలం బిశానత్తం ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చే అవకాశముంది..

70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు

|

Updated on: Dec 15, 2023 | 10:02 PM

చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు భయపెడుతోంది. కర్నాటక సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి..కర్నాటక నుంచి కుప్పంవైపు 70 ఏనుగుల గుంపు తరలిరావడంపై అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పొలాలు, సరిహద్దుప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు..ప్రస్తుతం ఏనుగుల గుంపు కర్నాటక పరిధిలోని కామసముద్రం దగ్గర తిష్ఠ వేసినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి గుడిపల్లి మండలం బిశానత్తం ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చే అవకాశముంది..అక్కడే నిఘా పెట్టిన అటవీశాఖ అధికారులు యానిమల్ క్రాకర్స్‌తో వాటిని అడవిలోకి పంపేందుకు యత్నిస్తున్నారు. గతంలో కూడ సుమారు 40 ఏనుగులు గుంపు కర్ణాటక నుండి ఆంధ్రలోకి ప్రవేశించి, కొంత మందిని పొట్టన పెట్టుకొన్న సందర్భాలు చోటుచేసుకొన్నాయి. అవే ఏనుగులు పలమనేరు అటవీ ప్రాంతాల్లో తిష్ట వేసి బైరెడ్డిపల్లి, వీకోట పలు మండలాల్లో కోత దశలో ఉన్న పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతన్నలు వ్యవసాయానికి స్వస్తి పలకాల్సిందేనని భయందోళన చెందుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??

లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు

Follow us