AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను సర్ఫరాజ్ ఊచకోత కోశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎదురుదాడికి దిగి, తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 5వ డబుల్ సెంచరీని బాదేశాడు.

Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్
Sarfaraz Khan
Rakesh
|

Updated on: Jan 23, 2026 | 3:15 PM

Share

Sarfaraz Khan : భారత క్రికెట్‌లో సెలక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రతిసారి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం సర్ఫరాజ్ ఖాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా రంజీ ట్రోఫీలో ఈ ముంబై బ్యాటర్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను సర్ఫరాజ్ ఊచకోత కోశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎదురుదాడికి దిగి, తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 5వ డబుల్ సెంచరీని బాదేశాడు.

హైదరాబాద్‌తో జరుగుతున్న ఈ కీలక మ్యాచులో ముంబై జట్టు పటిష్ట స్థితిలో నిలవడానికి సర్పరాజ్ న్ ఇన్నింగ్స్ ప్రధాన కారణం. మ్యాచ్ మొదటి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్, 142 పరుగులతో నాటౌట్‌గా రెండో రోజు ఆటను ప్రారంభించాడు. శుక్రవారం (జనవరి 23) ఉదయం సెషన్ నుంచే హైదరాబాద్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. కేవలం 206 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. సర్ఫరాజ్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 219 బంతులు ఎదుర్కొని 227 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండడం గమనార్హం. కేవలం 61 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలోనే 5 డబుల్ సెంచరీలు సాధించి తన అసాధారణ ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్ సందర్భంగా సర్ఫరాజ్ హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా వదల్లేదు. సిరాజ్ వేగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు. ముంబై కెప్టెన్ సిద్ధేష్ లాడ్‌తో కలిసి సర్ఫరాజ్ 249 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లాడ్ కూడా 104 పరుగులతో మెరిశాడు. చివరకు రక్షణ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ముంబై స్కోరు 488 పరుగులకు చేరుకుంది.

సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అజేయంగా దూసుకుపోతున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ, ఆపై విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీతో మెరిసిన ఈ యువ బ్యాటర్, ఇప్పుడు కొత్త ఏడాదిని డబుల్ సెంచరీతో ప్రారంభించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ తనను పదే పదే విస్మరిస్తున్నప్పటికీ, మైదానంలో తన ప్రదర్శన ద్వారా వారి నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాడు. ఇంతటి స్థిరమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెలక్టర్లపై మండిపడుతున్నారు.

హైదరాబాద్ పిచ్‌పై సర్ఫరాజ్ ఆడిన తీరు చూస్తుంటే అతడి టెక్నిక్, పవర్ హిట్టింగ్ కెపాసిటీ స్పష్టమవుతోంది. ముఖ్యంగా స్పిన్నర్లను స్వీప్ షాట్లతో, పేసర్లను అప్పర్ కట్లతో బెంబేలెత్తించాడు. ఈ భారీ స్కోరుతో ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో పట్టు సాధించింది. సర్ఫరాజ్ చేసిన ఈ 227 పరుగులు కేవలం స్కోరు బోర్డు మీద అంకెలు మాత్రమే కాదు, జాతీయ జట్టు తలుపులు తట్టే ఒక స్ట్రాంగ్ హెచ్చరిక అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్