AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Kodanda Bow: కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?

శ్రీరాముడి ఆయుధం కోదండం. శక్తి ఉన్నా సంయమనంతో వినియోగించిన మహనీయుడు శ్రీ రాముడు. లంకకు వెళ్లే సమయములో సముద్రుడిని శాంతిప చేయటం కోసం కోదండాన్ని శ్రీరాముడు ఎత్తగానే సముద్రుడు ప్రత్యక్షమవుతాడు. శ్రీరాముని బలానికి కాదు ఆయన ధర్మనిరతిని కీర్తించి దారి ఇస్తాడు. అందుకే శ్రీరాముని కోదండం..

Ayodhya Ram Kodanda Bow: కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
Ayodhya Ram Kodanda Bow
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 3:20 PM

Share

ఏలూరు, జనవరి 23: యుగాలు గడుస్తున్నా శ్రీరాముడు పురుషోత్తముడిగా పూజలు అందుకుంటూనే ఉన్నారు. త్రేతాయుగం లో ధర్మానికి మార్గదర్శకునిగా తన ఆచరణతో ఆదర్శంగా నిలిచారు. తండ్రి మాట కోసం రాజ్య త్యాగం, సీత అపహరణ జరిగిన సమయంలో పతి ధర్మం కోసం చేసిన నడక , సముద్రం దాటి సాగించిన లంకా యాత్ర, రావణ సంహారం ద్వారా శ్రీ రాముడు సాధించిన ధర్మ విజయం కలియుగంలోనూ మనుషులకు ఆచరణీయ మార్గాలు. శ్రీ రాముడు చేతిలో ఉండే ధనుస్సు ధర్మానికి ప్రతీకగా హిందువులు భావిస్తారు. నిత్యం భగవంతునిగా పూజలందుకుంటున్న ఆ అయోధ్యారాముడు కోట్లాది మంది ఆరాధ్యదైవం.

ఆయన ఆయుధం కోదండం. శక్తి ఉన్నా సంయమనంతో వినియోగించిన మహనీయుడు శ్రీ రాముడు. లంకకు వెళ్లే సమయములో సముద్రుడిని శాంతిప చేయటం కోసం కోదండాన్ని శ్రీరాముడు ఎత్తగానే సముద్రుడు ప్రత్యక్షమవుతాడు. శ్రీరాముని బలానికి కాదు ఆయన ధర్మనిరతిని కీర్తించి దారి ఇస్తాడు. అందుకే శ్రీరాముని కోదండం ఆయుధం అధికారం, బలంకు చిహ్నం కాదు.. మర్యాద, త్యాగం, న్యాయ బద్దమైన అంశాల సందేశంగా భావిస్తారు.

పంచలోహ కోదండంపై ఏముందంటే…

శ్రీరాముని జన్మ స్థలమైన అయోధ్యకు శ్రీరాముని కోసం తయారు చేయించిన 286 కిలోల బరువు ఉన్న పంచలోహ కోదండం చేరుకుంది. ఈ నెల 3న ఒరిస్సా నుంచి శోభాయాత్రగా సనాతన జాగరణ్ మంచ్ – రూర్కెలా శోభాయాత్ర నిర్వహిస్తూ అయోధ్యకు కోదండంను తీసుకువచ్చింది. అంతకు ముందు బంగారం, వెండి, అల్యూమినియం, జింక్, ఇనుము మొత్తం ఐదు లోహాలు వాడి తయారు చేయించిన కోదండంకు పూరిలో భగవాన్ జగన్నాధుని దర్శనం చేయించారు. శిల్పకారులు 8 నెలలపాటు తమిళనాడులోని కాంచీపురంలో శ్రమించి తయారుచేసిన కోదండం పై కార్గిల్ యుద్ధం, భారతీయ సైన్యం వీరత్వం, పరాక్రమ విజయాలు చెక్కారు. శ్రీరాముడి మార్గాన్ని ఆచరించే కోట్లాది మందికి ఈ కోదండం సైతం ఎల్లప్పుడు ధర్మం, న్యాయం, మర్యాదలను పాటించాలనే సందేశాన్ని పంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..