‘అప్పటికల్లా 6 గ్యారెంటీలు అమలు చేసి తీరాలి’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్..
పంచ్ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప.. ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చడంతో..
పంచ్ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప.. ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చడంతో.. ఎదురుదాడికి దిగింది అధికారపక్షం. మొదట కేటీఆర్ వర్సెస్ పొన్నం, తర్వాత కేటీఆర్ వర్సెస్ భట్టిగా మాటల యుద్ధం జరిగితే… చివరికి కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్‌గా హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ నడిచింది. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటూ కేటీఆర్‌పై పంచ్‌లేశారు రేవంత్. సీఎం మాటల తూటాలకు అంతే దీటుగా సమాధానం చెప్పారు కేటీఆర్.
కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థంకాదని.. ఎంత చెప్పినా ఆ ఎన్నారైలు అర్థంచేసుకోలేరని.. ఎన్నారై అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అంటూ కేటీఆర్‌పై పంచ్‌లు వేశారు సీఎం రేవంత్. మేనేజ్‌మెంట్ కోటా కింద తెలంగాణలో పదవులు అనుభవించిందెవరంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నారైలకు టిక్కెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారాయన. ‘తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని.. ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్నారై అని సీఎం రేవంత్ కామెంట్ చేశారని.. పార్టీ అధ్యక్షురాలిని విదేశాల నుంచి తెచ్చుకున్నది ఏ పార్టీయే చెప్పాలని నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇది చూస్తేనే ఎన్నారైలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్ధమైందని ఎద్దేవా చేశారు.
తెలంగాణను తెచ్చిన వ్యక్తిని ఏకవచనంతో సీఎం మాట్లాడారని.. ఈ పదేళ్లలో మా ప్రాణం పణంగా పెట్టి పని చేశామన్నారు కేటీఆర్. మా పదేళ్ల పాలనలో పాలమూరులో వలసలు బంద్ అయ్యాయని గుర్తు చేశారాయన. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోని ప్రతి హామిని నిలబెట్టుకోవాలని.. కచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరాలని చెప్పారు కేటీఆర్ రెండు గ్యారంటీల్లో పావువంతు కూడా అమలు కాలేదు.. మార్చి 17కి వందరోజులు పూర్తవుతాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. మొదటి క్యాబినెట్‌లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు..ఇప్పటివరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు కేటీఆర్.