Assembly Panel Speakers: ప్యానెల్ స్పీకర్లు సభకు ఎప్పుడు అధ్యక్షత వహిస్తారు? వారికి ఉండే అర్హతలు ఏంటీ..?
ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. అయితే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సభలో లేనప్పుడు సభకు అధ్యక్షత వహించేలా నియమించే తాత్కాలిక స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ప్యానెల్ స్పీకర్లను అసెంబ్లీ స్పీకర్ నియమిస్తారు.

తెలంగాణ అసెంబ్లీలో నూతన శాసనసభ కొలువదీరనుంది. కొత్తగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్యానెల్ స్పీకర్లను ప్రకటించారు. ప్యానెల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్, కౌసర్ మొహియుద్దీన్, కూనంనేనీ సాంబశివరావులకు ఛాన్స్ దక్కింది. శాసనసభకు సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అయితే వీరిద్దరూ సభలో లేనప్పుడు సభను నడిపించేందుకు నియమించే తాత్కాలికంగా స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. శాసనసభకు వారిని ఏ అర్హత ఆధారంగా నియమిస్తారు? అనేది చూద్దాం.
ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. అయితే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సభలో లేనప్పుడు సభకు అధ్యక్షత వహించేలా నియమించే తాత్కాలిక స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ప్యానెల్ స్పీకర్లను అసెంబ్లీ స్పీకర్ నియమిస్తారు.
సీనియర్ సభ్యులను శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ మాదిరిగానే ప్యానెల్ స్పీకర్ల నియామకం ఉంటుంది. సీనియర్ సభ్యులైన ఒకరు నుంచి నలుగురిని ప్యానెల్ స్పీకర్లుగా నియామకం చేయడం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేనప్పుడు సభకు ప్యానెల్ స్పీకర్లు శాసన సభకు అధ్యక్షత వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్లుగా సీనియర్ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్, కౌసర్ మొహియుద్దీన్, కూనంనేనీ సాంబశివరావులను నియమించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…