23 January 2026
రోజూ ఓ గ్లాస్ తాగండి.. శరీరంలో మార్పు చూస్తే మతిపోవాల్సిందే
Venkata Chari
ఆరోగ్యంపై అంతా శ్రద్ధచూపిస్తుంటారు. కానీ, టిప్స్ పాటించడంలో మాత్రం విఫలమవుతుంటారు. దీంతో అనుకున్న ఫలితాలు సాధించలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.
ఈ క్రమంలో మన ఇంట్లోనే దొరికే ఓ కాయగూరతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాకరకాయ చేదుగా ఉండటం వల్ల ఎవరూ దానిని తినడానికి ఇష్టపడరు. కానీ, ఎన్నో దివ్య ఔషధాలు కాకరకాయలో ఉన్నాయని తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
రోజూ కాకరకాయ రసం తాగడం వల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలుసా? ఉపయోగాలు తెలిస్తే ఇప్పుడు తాగేందుకు సిద్ధమవుతారు.
రోజూ కాకరకాయ రసం తాగితే, మీ రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఇందులో ఉండే చేదు గుణం ఒంటికి ఎంతో ఉపయోగం.
ప్రతిరోజూ కాకరకాయ రసం తాగడం వలన పెరుగుతున్న బరువును కూడా తగ్గిస్తుంది. దీంతో స్లిమ్ గా తయరు కావొచ్చు.
అలాగే, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా ఈజీగా పరిష్కరించవచ్చు. జీర్ణక్రియ సక్రమంగా ఉంటే ఎటువంటి రోగాలు మనను ఇబ్బంది పెట్టవు.
గమనిక: ఈ వార్త మీకు అవగాహన కల్పించడం కోసమే అందించాం. టీవీ9 దీనిని నిర్ధారించలేదు. ఏదైనా టిప్ పాటించే ముందు నిపుణులను సంప్రదించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
హిస్టరీ క్రియేట్.. రికార్డులతో అదరగొట్టిన రోహిత్ శర్మ
చరిత్ర సృష్టించిన విరాట్.. వన్డేల్లో సరికొత్త రికార్డ్
28 ఏళ్లలో తొలిసారి.. ఘోర పరాజయంతో అత్యంత చెత్త రికార్డులో టీమిండియా