AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: గ్రామంలో మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబు అడిగిన ప్రశ్నకు మైండ్ బ్లాంక్..

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పోల్ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనపై గ్రామసభ రసాభాసగా మారింది. ఎన్నికల హామీ మేరకు గ్రామంలో మద్యం నిషేధం అమలు చేస్తామని సర్పంచ్ సునీత రెడ్డి ప్రకటించడంతో మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు మద్యం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని వాదించగా...

Sangareddy: గ్రామంలో మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబు అడిగిన ప్రశ్నకు మైండ్ బ్లాంక్..
Gram Sabha
P Shivteja
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 3:15 PM

Share

తమ గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలించాలని మహిళలు కోరితే.. బెల్ట్ షాపులను ఎలా ఎత్తేస్తారంటూ మందుబాబులు మండిపడ్డారు. ఈ విచిత్ర ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. కొర్పోల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రచకెక్కింది. తాను సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలిస్తానని గ్రామ సర్పంచ్ సునీత రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో గురువారం మొదటిసారి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు గ్రామంలోని మహిళలతో పాటు, యువకులకు, మందుబాబులకు కూడా పిలుపందింది. గ్రామస్తులంతా గ్రామసభ నిర్వహిస్తున్న చోటుకు చేరుకోవడంతో గ్రామ సర్పంచ్ సునీత రెడ్డి గ్రామసభలో బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం నిషేధంపై తీర్మానం చేస్తున్నానని  చెప్పడంతో మందుబాబులు ఒక్కసారిగా ఆగ్రహించారు. బెల్ట్ షాపులు ఎలా బంద్ చేస్తారంటూ మద్యపానం తీర్మానానికి పలువురు మందుబాబులు అడ్డు తగిలారు. అసలు మీరు సర్పంచ్ ఎన్నికల్లో మందు పంచకుండానే గెలిచారా అంటూ ఎదురు ప్రశ్నించారు.  దీంతో మహిళలకు.. మందుబాబులకు మద్య వాగ్వాదం నడిచింది. కాయకష్టం చేసి రాత్రిపూట.. ఎంతో కొంత మద్యం సేవించి ప్రశాంతంగా నిద్రిస్తామని మందుబాబులు అంటుంటే.. గ్రామంలో మద్యం సేవించి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. అందుకే మద్యపానం, బెల్ట్ షాపులను నిషేధించాలని మహిళలు సర్పంచ్‌ను గ్రామసభ వేదికగా కోరారు. గ్రామసభలో వాగ్వాదం మధ్య బెల్ట్ షాపులను బంద్ చేయాలని సర్పంచ్ సునీత రెడ్డి తీర్మానించారు. దీంతో కొర్పోల్ గ్రామంలో నేటి నుంచి మద్యపాన నిషేధం అమలు అవ్వనుంది. మరి దీనిపై మందుబాబుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్