AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: గ్యాస్‌ స్టౌను క్లీనింగ్‌కు సూపర్ చిట్కా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో అద్దంలా మెరవాల్సిందే

వంట గదిలో జనాలు ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్యాస్ స్టవ్‌పై ఉండే మొండి మరకలు. వీటిని తొలగిచడం అనేది చాలా మందికి పెద్ద టాస్క్. ఇందుకోసం జనాలు రకరకాల ఉత్పత్తులను వాడినప్పటికి.. పూర్తి స్థాయి ఫలితం పొందలేరు. కాబట్టి ఇంట్లోనే సహజంగా స్టౌపై ఉన్న మొండి మరకలను ఎలా క్లిన్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Kitchen Hacks: గ్యాస్‌ స్టౌను క్లీనింగ్‌కు సూపర్ చిట్కా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో అద్దంలా మెరవాల్సిందే
Gas Stove Cleaning
Anand T
|

Updated on: Jan 23, 2026 | 3:03 PM

Share

ఒకప్పుడంటే ఇంట్లో వంట చేసుకునేందుకు జనాలు కట్టెల పొయ్యిలను వాడేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్‌లు ఉంటున్నాయి. వాటిపైనే అందరూ వంటలు చేస్తున్నాయి. అయితే వంట చేసే క్రమంలో వీటిపై పడే నూనె, ఇతర పదార్థాల కాణంగా మొండి మరకలు ఏర్పడుతాయి. అయితే చాలా మంది ఈ మొండి మరకలను తొలగించడానికి రసాయన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో దొరికే, నిమ్మకాయ, బేకింగ్ సోడా వంటి, వెనిగర్ వంటి వాటిని ఉపయోగించి మీ గ్యాస్ స్టవ్‌ను మళ్లీ కొత్తగా కనిపించేలా చేయవచ్చని మీకు తెలుసా? తెలియక పోతే ఇక్కడ తెలుసుకోండి.

స్టవ్ మీద మరకలను తొలగించడానికి చిట్కాలు

మీ ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ మీద మొండి మరకలను తొలగించడానికి మీరు నిమ్మకాయ, ఉప్పును ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక నిమ్మకాయను సగానికి కోసి, ఆ ముక్కపై కొంచెం ఉప్పు వేసి, దాంతో గ్యాస్ స్టవ్‌పై జిడ్డు మరకాలు ఉన్న ప్రదేశాల్లో రుద్దండి. నిమ్మకాయలోని ఎసిటిక్ ఆమ్లం, ఉప్పు రాపిడి లక్షణాలు మొండి గ్రీజును పూర్తిగా తొలగిస్తాయి. తరువాత, తడి గుడ్డతో గ్యాస్ స్టవ్ శుభ్రం చేయండి, అప్పుడు మీ స్టౌ కొత్త దానిలా మెరుస్తుంది.

వెనిగర్, బేకింగ్ సోడా పద్దతి

మీ గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి మీరు వెనిగర్, బేకింగ్ సోడా కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు గ్యాస్ రెగ్యులేటర్‌ను, దానికి ఉన్న రెండు బర్నర్‌లు తొగించి. స్టవ్ పై బేకింగ్ సోడా, కొంచెం తెల్ల వెనిగర్ తీసుకొని ఒక కప్‌లో వేసి బాగా కలపండి. తర్వాత ఈ రెండింటి మిశ్రమం స్టవ్‌పై ఉన్న మొండి గ్రీజు, నూనె మరకలపై మృదువుగా రఫ్ చేయండి.10 నిమిషాల తర్వాత, టూత్ బ్రష్‌తో స్టవ్‌ను సున్నితంగా స్క్రబ్ చేయండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. ఇప్పుడు మీ గ్యాస్ స్టవ్ కొత్తగా కనిపిస్తుంది.

వేడి నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్

గ్యాస్ స్టవ్ మీద ప్లేట్లు, బర్నర్లను శుభ్రం చేయడంలో డిష్ వాషింగ్ లిక్విడ్, వేడి నీరు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దీని కోసం, ఒక బకెట్‌లో వేడి నీటిని పోసి దానికి కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ప్లేట్లు ,బర్నర్‌లను అందులో వేసి 15 నిమిషాలు నానబెట్టండి. తరువాత వాటిపై పేరుకుపోయిన మురికిని బ్రష్‌తో రఫ్‌ చేసి ఆరిన తర్వాత క్లాత్ తీసుకొని క్లీన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ స్టవ్ కొత్త దానిలా ఎప్పుడూ మెరుస్తూ ఉటుంది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
మహిళల కోసం కేంద్రం పథకం.. రూ.1.4 లక్షల వరకు లబ్ది
మహిళల కోసం కేంద్రం పథకం.. రూ.1.4 లక్షల వరకు లబ్ది
'వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే..
'వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే..