Ghee benefits: చెంచెడు నెయ్యితో చెప్పలేనన్ని లాభాలు.. రోజూ ఒక్క స్పూన్ తింటే..
నెయ్యిలో మన ఆరోగ్యానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే మన పూర్వీకుల నుంచి నేటి వరకు వంటకాల్లో నెయ్యిని వాడుతుంటారు. నెయ్యిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా పదండి.

నెయ్యి మన ఆరోగ్యానికి అనేక రకాలు మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మలబద్ధకం, మూలవ్యాధి వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మీ శరీర శక్తి, జీవక్రియను పెంచుతాయి. మీరు మీ ఎముకలను బలోపేతం చేయాలనుకుంటున్నా, లేదా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నా.. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1-2 టీస్పూన్ల దేశీ నెయ్యిని తినండి. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే ఈ సమస్యలను పూర్తిగా తొలగించుకోవచ్చు.
దేశీయ నెయ్యితో కలిగే ప్రయోజనాలు
ముఖ్యంగా శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది క్షీణిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు నెయ్యిని ఆహారంలో చేర్చుకోవచ్చు. దేశీ నెయ్యి కంటి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. దేశీ నెయ్యి మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే పార్కిన్సన్స్, చిత్తవైకల్యం వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.
రోజూ ఎంత నెయ్యి తినాలి, ఎలా తినాలి
మీరు నెయ్యి పూర్తి ప్రయోజనాలు పొందాలి అనుకుంటే.. ఉదయం ఖాళీ కడుపుతో 1-2 టీస్పూన్ల ఆవు నెయ్యి తీసుకోండి. మీరు దానిని గోరువెచ్చని లేదా వేడి నీటితో త్రాగవచ్చు. కావాలంటే అందులోకి చిటికెడు పసుపు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తంమీద, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ , విటమిన్ కె, ఒమేగా-3 మరియు 9 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న దేశీ నెయ్యిని మితంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. కానీ ఎక్కవగా తీసుకోవద్దు. నెయ్యి అలర్జీలు ఉన్న వారు దానికి దూరంగా ఉండడం మంచింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
