AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darkness around the neck: మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ వ్యాధి ఉండొచ్చు?

Darkness around the neck: చాలా మందికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. ఒక్కోసారి కొందరికి అకస్మాత్తుగా మెడ చుట్టూ ఈ నల్లటి గీతలు ఏర్పడుతుంటాయి. ఎంత శుభ్రం చేసినా అవి పోవు. అయితే, స్త్రీల కంటే పురుషులలోనే ఇలాంటి గీతలు ఎక్కువగా కనిపించడం కూడా మీరు గమనించే ఉంటారు. అయితే, ఎవరూ వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ, మీ నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. మెడ మీద ఈ నల్లని గీతలు మురికి,ఎండవల్ల వచ్చినవి కాదు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు హెచ్చరిక సంకేతం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

Darkness around the neck: మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ వ్యాధి ఉండొచ్చు?
Black Neck
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2026 | 8:32 AM

Share

Darkness around the neck: మెడ భాగం నల్లబడడం చాలా మందిలో చూస్తుంటాం. ఎండ, చెమట, కాలుష్యం కారణంగా మెడ చుట్టూ ఇలా నల్లటి పొర ఏర్పడిందని భావిస్తుంటారు. స్నానం చేసేటప్పుడు సబ్బుతో తెగ రుద్దేస్తుంటారు. అలాగే, రకరకాల చిట్కాలు, కెమికల్‌ ఆధారిత క్రీములు వాడుతుంటారు. కానీ మన మెడపై ఉన్న ఈ నల్లటి గీతలు కేవలం మురికి వల్ల వచ్చింది మాత్రమే కాదు..తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు హెచ్చరిక సంకేతం అని మీకు తెలుసా? వైద్యపరంగా ఇవి అకాంటోసిస్ నైగ్రికన్స్ అనే వ్యాధికి సంకేతాలు కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. దీని కారణంగా శరీరంలోని అనేక భాగాలలో పిగ్మెంటేషన్ ప్రారంభమవుతుంది. అసలు అకాంటోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి?

వైద్యుల ప్రకారం.. అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది మధుమేహం వల్ల వచ్చే ఒక రకమైన పిగ్మెంటేషన్. ఎక్కువగా ప్రీడయాబెటిస్ సమస్య ఉన్నవారిలో అంటే మధుమేహం వచ్చేముందు లక్షణాల్లో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. ఇలా మెడ దగ్గర ఈ పిగ్మెంటేషన్ కనిపించడం ప్రారంభం అవుతుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత కారణంగా ఇది జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో చర్మంపై పెద్ద డార్క్ ప్యాచ్‌లు కనిపించడం గమనిస్తారని చెబుతున్నారు. అకాంటోసిస్ నైగ్రికన్స్ లక్షణాలేంటో తెలుసుకోవాలి.

అకాంటోసిస్ నైగ్రికన్స్ అనేది అతి పెద్ద లక్షణాలు చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది. దీనిలో శరీరంలోని అనేక భాగాలు నల్లగా మారడం, చర్మం గట్టిగా, కఠినంగా మారడం, చర్మంపై దద్దుర్లు కనిపించడం మొదలవుతాయి. ఇది ఎక్కువగా శరీరంలోని మెడచుట్టూ, ఉదరం లేదా తొడ మధ్యలో, మోచేయి, మోకాలి భాగంలో, పెదవులు, అరచేతులు, అరికాళ్ళలో నల్లగా మారటం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో, దీనికి కారణం ఇన్సులిన్ నిరోధకత వ్యాధి. దీనిలో శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. దీని కారణంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. టైప్-2 మధుమేహం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..