Telangana: తెరపైకి గత సెంటిమెంట్.. మెదక్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సెంటిమెంట్ కురిపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా.. మెదక్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సెంటిమెంట్ కురిపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా.. మెదక్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక.. మెదక్ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ సెంటిమెంట్‌ను పండించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందిరమ్మ తుదిశ్వాస విడిచేనాటికి మెదక్ ఎంపీగానే ఉన్నారని గుర్తు చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి ఆమె ప్రధాని అయిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు.
దుబ్బాక ప్రజలు తిరస్కరిస్తే రఘునందన్‌రావు మళ్లీ మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. దుబ్బాకలో ఏ రంగుతో పోటీ చేశానో.. అదే రంగుతో మెదక్‌లోనూ పోటీ చేస్తున్నానంటూ రేవంత్‌కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. ఇక.. పదేళ్లలో మెదక్ జిల్లాకు ఏం చేశారన్న రేవంత్ కామెంట్స్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఎటాక్ చేశారు. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మొత్తంగా.. మెదక్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ చేయగా.. అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీశ్‌రావు, రఘునందన్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..