ఎన్నికల వేళ తెరపైకి దీక్షల పరంపర.. అసలు కారణం ఏంటి..

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల దీక్షలు.. కొందరు నిమ్మరసం ఇవ్వడాలు చర్చనీయాంశం అవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మోత్కుపల్లి దీక్ష చేయగా.. సీనియర్‌ నేత వీ.హనుమంతరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఇప్పుడు.. వీహెచ్‌ మౌన దీక్ష చేయగా.. దానం నాగేందర్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడం ఆసక్తి రేపుతోంది.

ఎన్నికల వేళ తెరపైకి దీక్షల పరంపర.. అసలు కారణం ఏంటి..
Telangana Congress Leaders
Follow us

|

Updated on: Apr 21, 2024 | 10:00 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల దీక్షలు.. కొందరు నిమ్మరసం ఇవ్వడాలు చర్చనీయాంశం అవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మోత్కుపల్లి దీక్ష చేయగా.. సీనియర్‌ నేత వీ.హనుమంతరావు దీక్షకు సంఘీభావం తెలుపగా సర్వే సత్యనారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇప్పుడు.. వీహెచ్‌ మౌన దీక్ష చేయగా.. దానం నాగేందర్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ.. టీ.కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల దీక్షల వెనకున్న కారణాలు ఏంటి..? ఈ దీక్షలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్‌ ఇంట్రస్టింగ్‌ మారుతున్నాయి. ఒకవైపు.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. టీ. కాంగ్రెస్‌లో మాత్రం దీక్షల సీజన్‌ నడుస్తోంది. కొందరు సీనియర్లు దీక్ష చేస్తుంటే.. మరికొందరు ఆ దీక్షలకు మద్దతు తెలిపి.. నిమ్మరసం ఇచ్చి విరమింపజేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ అంబర్ పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇక.. బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. బీజేపీలోకి వెళ్తున్నాననే ప్రచారానికి చెక్‌ పెట్టేందుకే ఒక్కరోజు మౌన దీక్ష చేశానన్నారు వీహెచ్‌.

ఇదిలావుంటే.. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఒక్క రోజు దీక్ష చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గాలకు కాంగ్రెస్‌ రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మోత్కుపల్లి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. తన ఇంట్లో దీక్ష చేపట్టిన మోత్కుపల్లికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. సర్వే సత్యనారాయణ మోత్కుపల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇక.. 80 లక్షల మంది ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి నరసింహులు. అటు.. మోత్కుపల్లి నిరసన దీక్షకు వివిధ జిల్లాల దళిత సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా.. తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల వరుస దీక్షలు హాట్‌టాపిక్‌గా మారాయి. అటు.. మోత్కుపల్లి, ఇటు వీహెచ్‌.. ఇద్దరు దీక్షలు చేపట్టడం.. వారికి టీ.కాంగ్రెస్‌ నేతలే నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
'ఓనర్ అంటే మీలా ఉండాలి మేడమ్'.. MI ప్లేయర్లతో నీతా ఏం చెప్పారంటే?
'ఓనర్ అంటే మీలా ఉండాలి మేడమ్'.. MI ప్లేయర్లతో నీతా ఏం చెప్పారంటే?
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?