TS Inter Results 2024: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఫలితాల ప్రకటన తేదీ వెల్లడించిన విద్యాశాఖ! ఎప్పుడంటే

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడి చేయనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే..

TS Inter Results 2024: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఫలితాల ప్రకటన తేదీ వెల్లడించిన విద్యాశాఖ! ఎప్పుడంటే
TS Inter Results
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 21, 2024 | 6:32 AM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడి చేయనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టారు.

మూల్యాంకన ప్రక్రియ 10 వ తేదీతో పూర్తి చేశారు. ఆన్‌లోన్‌ మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ ఒక్క విద్యార్ధికి అన్యాయం జరగకుండా జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించారు. అలాగే కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి. కాగా గతేడాది (2023) ఇంటర్‌ ఫలితాలు మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతకంటే 15 రోజుల ముందుగానే ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్మీడియల్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటన అనంతరం రిజల్ట్స్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఇప్పటికే పొరుగున ఉన్న ఆధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక పదో తరగతి ఫలితాలు కూడా సోమవారం (ఏప్రిల్ 22) ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా ఏపీలో ఫలితాలను వెనువెంటనే వెల్లడిస్తున్నారు. తెలంగాణలోనూ ఈ వారంలో ఇంటర్‌తోపాటు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను టీవీ 9 తెలుగు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.