అమ్మో.. వెలుగులోకి వచ్చిన మరో మత్తు పదార్థం.. బోన్‌ఫిక్స్‌కు అలవాటు పడుతున్న చిన్నారులు
మాయదారి మత్తు "బోనోఫిక్స్" ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ.. పిల్లలు వాటి వాసన పీల్చుకొని మత్తుకు అలవాటు పడుతున్నారు. చదువుకు దూరమవుతున్న పిల్లలు ఈ మత్తు లో ఊగిపోతున్నారు. ఇది చిన్నారుల పాలిట శాపంగా మారుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయిపై ఉక్కు పాదం మోపుతూ కేసులు పెట్టి విక్రయదారులను, కొనుగోలుదారులను, రిమాండ్ కు తరలిస్తుంటే మరోవైపు ఈ కొత్త మత్తు వెలుగులోకి వచ్చింది.

మాయదారి మత్తు “బోనోఫిక్స్” ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ.. పిల్లలు వాటి వాసన పీల్చుకొని మత్తుకు అలవాటు పడుతున్నారు. చదువుకు దూరమవుతున్న పిల్లలు ఈ మత్తు లో ఊగిపోతున్నారు. ఇది చిన్నారుల పాలిట శాపంగా మారుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయిపై ఉక్కు పాదం మోపుతూ కేసులు పెట్టి విక్రయదారులను, కొనుగోలుదారులను, రిమాండ్ కు తరలిస్తుంటే మరోవైపు ఈ కొత్త మత్తు వెలుగులోకి వచ్చింది. యువత, చిన్నారుల తల్లిదండ్రులను ఈ “బోనోఫిక్స్” కలవరపెడుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత 15 రోజుల క్రితం బోనోఫిక్స్ మత్తుమందు సేవిస్తూ కనిపించిన బాలుడు పట్టుకునే సమయంలో పరారీకాగా అదే బాలుడు నిన్న సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో బోనోఫిక్స్ మత్తు పదార్థం సేవిస్తుండగా సిరిసిల్ల పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు ఆ బాలుని అదుపులోకి తీసుకొని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ బాలుడు బోనో ఫిక్స్ అనే మాయదారి మత్తుమందుకు బానిసైనట్లు తెలుస్తుంది. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో కలకలం సృష్టిస్తోంది డ్రగ్స్ తరహా మత్తు పదార్థమైన బోనఫిక్స్ ను ఓ 12 ఏళ్ల బాలుడు సేవిస్తుండడం విస్మయానికి గురిచేస్తుంది. ఎక్కడి నుండి ఇది దిగుమతి అవుతుంది అనే కొణంలో సిరిసిల్ల పోలీసులు అన్వేషిస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ పట్టుబడిన బాలుడు బొనఫిక్స్ తీసుకొని ఒక పోడవాటి ప్లాస్టిక్ సంచి తీసుకొని అందులో నాలుగు, ఐదు డ్రాప్ వేసుకొని ప్లాస్టిక్ సంచి నోటి దగ్గర పెట్టుకొని పీల్చడం ద్వారా ఒక రకమైన మత్తు వస్తుందని తెలిపారు. బాలుడు బోనఫిక్స్ సేవించడం అలవాటు చేసుకున్నాడనీ సిరిసిల్లలో మొదటి సారి అని ఇలాంటి కేసులు ఎక్కువగా మెట్రో నగరాల్లో, రైల్వే స్టేషన్లో నమోదు అవుతాయని అన్నారు. ఇలాంటి కేసులపై ప్రత్యేక దృష్టి పెడుతామని అన్నారు.
తల్లితండ్రులు కూడా పిల్లలపై అనుక్షణం గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. కాగా ఈ బోనఫిక్స్ మత్తు మందు సేవిస్తూ పట్టుబడ్డ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు అప్పగించామని తెలిపారు. బోనఫిక్స్, వైట్నరు అమ్మే వాళ్ళు కు ఒక సూచన చేశారు. ఎవరైనా చిన్న పిల్లలు కొనడానికి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో యువత గంజాయికీ బానిస అయిపోయింది. పోలీసులకు గంజాయి తరలిస్తూ లేదా.. పట్టుబడుతున్న వారిలో యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు గంజాయిని నిర్మూలించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే గంజాయి బారీన పడకుండా యువతకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.