AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chevella Bus Accident: టిప్పర్‌ ఓవర్‌ స్పీడ్‌ వల్లే ప్రమాదం.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు

ఒక సాధారణ ప్రయాణం...! ఒనానొక వారంతపు ముగింపు...! కానీ.. అది కొందరి జీవితాలకు శాశ్వత వీడ్కోలుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. సొంతూరి సంతోషాలను మనసులో దాచుకుని, తిరిగి పట్నం వెళ్తున్న ఆ నిండు ప్రాణాలు... టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువుకు బలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఏంటి..? ఎవరి నిర్లక్ష్యం ఇన్ని కుటుంబాల పాలిట శాపంగా మారింది? ఈ ప్రమాదం తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఏంటి..? 

Chevella Bus Accident: టిప్పర్‌ ఓవర్‌ స్పీడ్‌ వల్లే ప్రమాదం.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు
Chevella Bus Accident
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2025 | 8:33 AM

Share

ఎన్నో కలలు కళ్లలో దాచుకుని.. వారంతపు మధురానుభూతులు గుండెల్లో నింపుకొని.. ఎవరి పని మీద వారు బస్సెక్కారు. కానీ.. ఆ సాధారణ ప్రయాణం కొందరి జీవితాలకు శాశ్వత వీడ్కోలుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. సొంతూరి సంతోషాలను మనసులో దాచుకుని, తిరిగి పట్నం వెళ్తున్న ఆ నిండు ప్రాణాలు.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువుకు బలయ్యాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం ఏంటి..? ఎవరి నిర్లక్ష్యం ఇన్ని కుటుంబాల పాలిట శాపంగా మారింది? ఈ ప్రమాదం తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఏంటి..?

నోడౌట్‌… ఓవర్ లోడ్​.. రాంగ్​ రూట్​ డ్రైవింగ్..​ పైగా ఒళ్లు తెలీని వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. నిండు ప్రాణాలకు మృత్యువు వల విసిరింది! రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్‌ వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుంతలమయంగా ఉన్న సింగిల్‌ రోడ్డు కూడా ఈ ఘోరానికి కారణమైంది. పైగా టిప్పరూ బస్సూ రెండూ ఓవర్‌లోడే. దీంతో చావుకూడా ఓవర్‌లోడైంది. బస్సు కండక్టర్‌ రాధా ఫిర్యాదుతో చేవెళ్ల పీఎస్‌లో టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాష్‌పై కేసు నమోదైంది. అయితే నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కి శిక్షించడానికి అతను బతికి లేడు. అయితే రోడ్డుపై ఉన్న గుంతలు తప్పించే క్రమంలోనే టిప్పర్‌ డ్రైవర్‌.. అతివేగంగా రాంగ్‌ రూట్‌లోకి వచ్చాడా? అన్న దానిపై విచారణ జరుగుతోంది.

ప్రమాదంపై రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష

ఇవాళ ప్రమాద స్థలానికి డీజీపీ వెళ్లనున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనే దానిపై ఆయన పర్యవేక్షణ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నిర్లక్ష్యానికి, నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులెవరు? అనే దానిపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

టిప్పర్‌ అతివేగమే ప్రమాదానికి కారణం

మరోవైపు బస్సు ప్రమాదంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. టిప్పర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొంది. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్‌ డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్‌ గానీ కారణం కాదని స్పష్టం చేసింది. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని… డ్రైవర్‌ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేనట్టు తేలిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం తరపున రూ.5లక్షలు..కేంద్రం నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ప్రమాదంలో మొత్తం 19 మంది మరణించగా.. మృతులందరినీ గుర్తించి, పోస్టుమార్టం తర్వాత, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ యాక్సిడెంట్‌లో 20మంది గాయపడ్డారు. 10 మంది క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగితా వారు చేవెళ్లలోని పట్నం మహేందర్‌ రెడ్డి హాస్పిటల్‌, లలితా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక స్వల్ప గాయాలైన వాళ్లు చికిత్స తర్వాత స్వస్థలాలకు వెళ్లిపోయారు. క్షతగాత్రులను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం తరపున 5లక్షలు..కేంద్రం నుంచి 2 లక్షలు మొత్తంగా 7 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కండక్టర్‌ రాధా, మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు

కండక్టర్‌ రాధా, మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పీఎస్‌లో FIR నమోదైంది. మరోవైపు టిప్పర్ ఓనర్ లక్ష్మణ్‌ స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డ్‌ చేశారు. కంకర ఓవర్‌లోడింగ్‌కి కారణమైన స్టోన్‌ క్రషర్‌ ఓనర్‌, కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఓనర్‌లపై కూడా ఎంక్వైరీ షురూ చేశారు. టిప్పర్‌, క్రషర్‌, కన్‌స్ట్రక్షన్‌ ఓనర్లను ఎంక్వయిరీ చేసినా నిర్లక్ష్యం వీడని వ్యవస్థలో మరో ప్రమాదం జరగదన్న గ్యారంటీ ఉందా..? మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి