శివుడిపై ఉన్న అపారమైన భక్తిని.. ఓ భక్తుడు ఎలా ప్రదర్శించాడంటే..?

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు.. మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈ భక్తుడు మాత్రం తన భక్తిని మరో రకంగా చాటుకున్నాడు.

శివుడిపై ఉన్న అపారమైన భక్తిని.. ఓ భక్తుడు ఎలా ప్రదర్శించాడంటే..?
Gold Smith
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 08, 2024 | 6:11 PM

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు.. మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈ భక్తుడు మాత్రం తన భక్తిని మరో రకంగా చాటుకున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన శివశంకరాచారి ఇంటర్మీడియెట్‌ వరకు చదివాడు. తండ్రి రామాచారి కార్పెంటర్‌ కాగా, శివశంకరాచారి మాత్రం హైదరాబాద్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ దుకాణంలో పనిచేసేవాడు. ఇదే సమయంలో సూక్ష్మ చిత్ర కళాకారుడుగా ఎదిగాడు. పలు అంశాలకు సంబంధించి సూక్ష్మ చిత్ర కళలను రూపొందించాడు.

నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. హైదరాబాద్‎కు తిరిగి వెళ్లకుండా స్వగ్రామంలో గోల్డ్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శివశంకరాచారి మొదటి నుంచి పరమేశ్వరుడికి భక్తుడు. ఈశ్వరుడిపై ఉన్న భక్తితో అతను 40 మిల్లీగ్రాముల బంగారంతో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు. మహా శివరాత్రి సందర్భంగా గంట సమయంలోనే బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారుచేసి కుడిచేతి గోరుపై ఉంచి ప్రదర్శించారు. ఈ సూక్ష్మ కళాఖండాన్ని స్వామివారికి అంకితం చేశాడు. శివశంకరాచారి గతంలో కూడా ఎన్నో సూక్ష్మ కళా ఖండాలను రూపొందించాడు. ఆరు గ్రాముల బంగారంతో డబుల్‌బెడ్‌రూం ఇంటిని, బియ్యపు గింజ పరిమాణంలో జాతీయ జెండాను తయారు చేశాడు. శివశంకరాచారి కళానైపుణ్యాన్ని గ్రామస్తులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..