Hyderabad Biryani: ఆహా ఏమి రుచి.. తినరా హైదరాబాద్ బిర్యానీ మైమరిచి..!

ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల బిర్యానీలు ఉన్నా.. వాటిలో హైదరాబాద్ బిర్యానీకున్న బ్రాండ్ ఇమేజ్ చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎగుమతి అవుతుంది అంటే దానికున్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజూ కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఓ వంటకమే కాదు.. కోట్లు కురిపించే బిజినెస్.

Hyderabad Biryani: ఆహా ఏమి రుచి.. తినరా హైదరాబాద్ బిర్యానీ మైమరిచి..!
హైదరాబాద్ బిర్యానీ
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 21, 2024 | 1:26 PM

బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే..! హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడం ఛార్మినార్‌, ముత్యాల హారాలతో పాటు గరం గరం దమ్‌కీ బిర్యానీ. ఆ రకంగా ఈ బిర్యానీ ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లోనే కాదు.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరిట హోటళ్లు కొలువుదీరాయి. ఆ హోటళ్ల ముందు నిత్యం బిర్యానీ ప్రియులు లొట్టలేసుకుంటూ క్యూ కడుతారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల బిర్యానీలు ఉన్నా.. వాటిలో హైదరాబాద్ బిర్యానీకున్న బ్రాండ్ ఇమేజ్ చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎగుమతి అవుతుంది అంటే దానికున్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజూ కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఓ వంటకమే కాదు.. కోట్లు కురిపించే బిజినెస్.

తింటే గారెలు తినాలి అన్నది పెద్దల మాట.. అయితే తింటే హైదరాబాద్‌ బిర్యానీయే తినాలి అన్నది నవతరం మాట. హైదరాబాదీలే కాదు దేశ, విదేశాల్లో కోట్లాది మంది ఆహార ప్రియులను ఫిదా చేస్తోంది హైదరాబాద్ బిర్యానీ. సామాన్యులు మొదలుకుని.. వీఐపీల వరకు ఇతర ప్రాంతాల నుంచి ఏదైనా పని మీద హైదరాబాద్ వస్తే.. తప్పకుండా ఇక్కడి దమ్‌కీ బిర్యానీ రుచి చూస్తారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవరు ఎంత బిజీ షెడ్యూల్‌తో హైదరాబాద్‌కు వచ్చినా.. గరం గరం బిర్యానీని ట్రై చేయడం మాత్రం మరిచిపోరు. తమ ఇళ్లకు వచ్చే అతిథులకు బిర్యానీ వడ్డించడం ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అందుకే ఆహార ప్రియుల మనసు దోచే వంటకాల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలుస్తోంది.

హైదరాబాద్ బిర్యానీ చరిత్ర ఇదీ..!

బిర్యానీ తయారీలో ఉపయోగించే ముడి సరకులు దాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి దోహదపడే చాలా అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉండటం విశేషం. హైదరాబాద్‌ బిర్యానీ చరిత్ర విషయానికొస్తే.. పర్షియన్‌ భాషలో బిరియన్‌ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం. 1518 – 1687 మధ్య హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్‌ షాహీల ద్వారా బిర్యానీ పర్షియ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం 1930-50లలో పర్షియ నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్‌లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి, పైన చిన్నగా ఉండే పాత్ర ఇది. ఇందులో ఒకేసారి 40 కేజీల వరకు వండేందుకు వీలున్న పెద్ద పాత్రను వాడుతారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు, మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్నివైపులా సమానంగా వేడి అందుతుంది. బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాల మేలు కలయిక బిర్యానీ రుచిని వర్ణనలకు అతీతంగా మారుస్తుంది. అన్నిటికీ మించి బిర్యానీ చేసే వంటపాక నిపుణుల పనితనం, సృజనాత్మకత దీని రుచిని రెట్టింపు చేస్తుంది. వంటపాక నిపుణులు ప్రత్యేక శైలిలో బిర్యానీ తయారు చేస్తారు. గరం గరం బిర్యానీ నుంచి వచ్చే సువాసనలు అందరినీ వావ్ అనిపిస్తాయి.

హైదరాబాద్‌ బిర్యానీకి ఎందుకింత క్రేజ్..?

పర్షియన్‌ భాషలో బిరియన్‌ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. పాత్ర దిగువన ఉన్న మాంసం ముక్కలు అధిక వేడి కారణంగా పాక్షిక్షంగా కాలుతాయి. అయితే కోల్‌కతా, ఆంబూర్‌, తలస్సేరి బిర్యానీలను నీటితో వండుతారు. ఈ కారణంగానే ఈ విధానంలో మాంసాన్ని కాల్చడం ఉండదు. బిర్యానీని వండడానికి ప్రత్యేక పాత్రను ఉపయోగిస్తారు. దీనిని బిర్యానీ దేఘ్‌ అంటారు. పాత్ర కింద విశాలంగా పైకి సన్నగా ఉండడం ఈ పాత్ర ప్రత్యేకత. హైదరాబాద్‌ బిర్యానీలో మాత్రమే పచ్చి మాసం, బియ్యాన్ని కలిపి వండుతారు. మాంసాన్ని విడిగా ఉడికించి బియ్యంలో కలిపితే దానిని పక్కి బిర్యానీగా పిలుస్తారు. పర్షియన్‌ భాషలో దమ్‌ అంటే శ్వాస లేదా ఆవిరి అనే అర్థం. పాత్రలోని ఆవిరి బయటకు పోకుండా మూతను పిండితో సీల్‌ చేస్తారు. మాసంతో పాటు, బియ్యం ఆవిరిపై ఉడుకుతుంది కాబట్టి దీనిని దమ్‌ బిర్యానీ అంటారు.

Hyderabadi Biryani

Hyderabadi Biryani

భళారే భాగ్యనగర బిర్యానీ..!

ఆహా ఏమి రుచి.. తినరా హైదరాబాద్ బిర్యానీ మైమరిచి.. అంటూ నగరవాసులు తెగ లాగించేస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు రెస్టారెంట్లు, ఇళ్లలో తినేవారు కలిపితే ఆరు మాసాల వ్యవధిలో కోటి బిర్యానీలు ఆరగించేస్తున్నారు. అంటే ఏడాదిలో రెండు కోట్ల బిర్యానీలను గుటకాయ స్వాహా చేస్తున్నారు. జులై 2న ప్రపంచ బిర్యానీ దినోత్సవంలో హైదరాబాద్ బిర్యానీకే పెద్దపీట. నగర వ్యాప్తంగా 15 వేల రెస్టారెంట్లు బిర్యానీ రుచులు అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరం దేశ బిర్యానీ రాజధానిగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు.

ఆన్‌లైన్‌లో బిర్యానీ హవా..!

ప్రపంచవ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా మన హైదరాబాద్‌ బిర్యానికి ఉండే క్రేజే వేరు. హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో ప్రతీ రోజూ ఏకంగా 3 లక్షలకు పైగా బిర్యానీ ప్లేట్స్‌ అమ్ముడు పోతున్నాయి. బిర్యానీ కారణంగా తెలంగాణలో ఏటా మాంసం ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. కేవలం చికెన్‌కు మాత్రమే పరిమితం కాకుండా మటన్‌ బిర్యానీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 2014లో తెలంగాణలో 5.42 లక్షల టన్నుల మాసం విక్రయాలు జరిగాయి. ఇది 2021-22 నాటికి 10.04 లక్షల టన్నులకు పెరిగింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మాంసంలో 10 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి కావడం విశేషం.

భారతీయుల జిహ్వచాపల్యాన్ని తీర్చడంలో హైదరాబాద్ బిర్యానీదే అగ్రస్థానమని ఫుడ్ డెలివరీ సంస్థలు చాటిచెబుతున్నాయి. అటు రెస్టారెంట్లతో పాటు ఆన్‌లైన్ ఫుడ్‌ యాప్స్‌లోనూ బిర్యానీకి భలే గిరాకీ ఉంది. గతేడాది ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌లో బిర్యానీ టాప్‌ ప్లేస్‌లో నిలవడమే దీనికి నిదర్శనం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ప్రతి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు జరుగుతున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు బిర్యానీ అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో.. బిర్యానీల్లోనూ హైదరాబాద్ బిర్యానీకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటోంది.

బిర్యానీ ఆర్డర్లలో దేశంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. మార్చి రెండో వారంలో స్విగ్గీ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 12 మాసాల 1.3 కోట్లకు పైగా బిర్యానీ ఆర్డర్లు దాని యాప్ ద్వారా అందాయి. దేశంలో వచ్చే ప్రతి ఐదు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే వస్తుండటం విశేషం. ఇందులో అత్యధికంగా చికిన్ బిర్యానీ కోసం ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఆ తర్వాతటి స్థానాల్లో వెజ్ బిర్యానీ, చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి.

Hyderabadi Biryani

Hyderabadi Biryani

బిర్యానీ తయారీ ఫార్ములా ఏమిటి?

హైదరాబాద్ బిర్యానీ కోసం 2017లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (GI) ట్యాగ్ కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ దరఖాస్తులో బిర్యానీ తయారీకి సంబంధించిన ఫార్ములాను వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దమ్ బిర్యానీని ఎలా తయారు చేస్తారో పూర్తి వివరాలతో పాటు నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రీ సూచించింది. దీంతో జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నాలను దరఖాస్తుదారులు విరమించుకున్నారు. జీఐ ట్యాగ్ లేని కారణంగా హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ దేశ నలుమూలలా లభిస్తోంది.

ఇక హైదరాబాద్ బిర్యానీ ధర విషయానికి వస్తే ఎవరి స్థాయికి తగ్గట్లు ఇది ఉంది. రోడ్డు కార్నర్‌లో చిన్న ఫుడ్ సెంటర్స్‌లో రూ.80కే ప్లేట్ బిర్యానీ వచ్చేస్తుంది. అయితే స్టార్ హోటళ్లలో ప్లేట్ బిర్యానీ రూ.1,500 వరకు ఉంటోంది. జీఎస్టీ గట్రాను దీనికి అధనంగా ఛార్జ్ చేస్తారు.

హైదరాబాద్ బిర్యానీకి పాక్ టీమ్ ఫిదా..!

గత ఏడాది ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లు రెండు వారాల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌కు పాక్ ప్లేయర్లు ఫిదా అయ్యారు. మ్యాచ్‌ల విరామంలో వీలు దొరికినప్పుడల్లా దాయాది దేశం ఆటగాళ్లు హైదరాబాద్ బిర్యానీని ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బిర్యానీ కారణంగా ఫిట్‌నెస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ పాక్ ఆటగాడు చమత్కరించడం విశేషం.

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!