Telangana: మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య.. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణం!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన హనుమకొండలోని బీమారంలో గురువారం (మార్చి 7) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హనుమకొండ, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన హనుమకొండలోని బీమారంలో గురువారం (మార్చి 7) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహితీ అనే విద్యార్ధిని బీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ నిర్వాహకులు చెబుతున్నారు. గురువారం రాత్రి ఘటన జరిగినా విద్యార్ధిని తల్లిదండ్రులకు మాత్రం శుక్రవారం ఉదయం వరకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచారు. నేరుగా పోస్ట్‌మార్టం తరలించాక మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని సాహితీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సాహితీ చేతికి, తల భాగాలకు దెబ్బలు తగిలి ఉండడం వారి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతో విద్యార్థిని సాహితీ మృతిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివరాత్రి వేళ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో కనపర్తి గ్రామంలో విషాదఛాయలు అల్లుకున్నాయి. మరోవైపు పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని సాహిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమన్యం చెబుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు మీడియాకు తెలిపారు. కాగా బాచుపల్లి ఘటన మరువముందే తాజాగా మరో విద్యార్థిని కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.