AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం.. ఐఐటీ మద్రాస్ అంట్రపెన్యురల్ ఫెస్టివల్ లో స్పీచ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్.. మంచి రాజకీయ నాయకుడే కాదు.. ఇతరులను ప్రభావితం చేసే కమ్యూనికేటర్ కూడా. ఈయనకు రాజకీయ పరమైన అంశాలపైనే కాకుండా, ఇతర అంశాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆయన కు నేషనల్, ఇంటర్నేషన్ సంస్థలు సైతం కీలక స్పీచ్ ఇవ్వాలని ఇన్విటేషన్ పంపుతుంటాయి. తాజాగా మరోసారి ఆయన కు కీలక ఆహ్వానం అందింది.

KTR: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం.. ఐఐటీ మద్రాస్ అంట్రపెన్యురల్ ఫెస్టివల్ లో స్పీచ్
KTR
Balu Jajala
|

Updated on: Mar 08, 2024 | 4:35 PM

Share

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్.. మంచి రాజకీయ నాయకుడే కాదు.. ఇతరులను ప్రభావితం చేసే కమ్యూనికేటర్ కూడా. ఈయనకు రాజకీయ పరమైన అంశాలపైనే కాకుండా, ఇతర అంశాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆయనకు నేషనల్, ఇంటర్నేషన్ సంస్థలు సైతం కీలక స్పీచ్ ఇవ్వాలని ఇన్విటేషన్ పంపుతుంటాయి. తాజాగా మరోసారి ఆయన కు కీలక ఆహ్వానం అందింది.

దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటి మద్రాస్ కేటీఆర్ ను తమ విద్య సంస్థలో జరుగబోయే సమ్మిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటి మద్రాస్ లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది.

కేటీఆర్ కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో ఐఐటి మద్రాస్ కోరింది. ఐఐటి మద్రాస్ విద్యార్థులు ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంలో నిలిచింది.

రేపు, ఎల్లుండి జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో విజ్ఞప్తి చేశారు. ఈసారి ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హెచ్ సి ఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ఐఐటి మద్రాస్ తెలిపింది.

ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేటీఆర్ తెలంగాణ లో వరుస సభలు, సమవేశాలను నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ లీడర్ల నుంచి తీవ్ర పోటీ తట్టుకుంటూ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి బీఆర్ఎస్ లో జోష్ నింపాలని భావిస్తున్నారాయన.