- Telugu News Photo Gallery Cricket photos Ind vs end dharamshala test team india spinner kuldeep yadav 5 wicket haul against england breaks 100 year old record
Kuldeep Yadav: వార్నీ, 5 వికెట్లతో.. 100 ఏళ్ల రికార్డ్‌ను మడతెట్టేశాడుగా.. స్పెషల్ లిస్ట్‌లో టీమిండియా చైనామన్?
Kuldeep Yadav Record: ఇంగ్లండ్‌తో జరిగిన ధర్మశాల టెస్టులో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టెస్టు క్రికెట్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టుకు ముందు కుల్దీప్ యాదవ్‌కు ఆడే అవకాశం వస్తుందని అతను కూడా అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ధర్మశాల వాతావరణం, పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో భారత జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫీల్డింగ్ చేస్తుందని ఊహించారు.
Updated on: Mar 08, 2024 | 3:57 PM

Kuldeep Yadav Records: ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టుకు ముందు కుల్దీప్ యాదవ్‌కు ఆడే అవకాశం వస్తుందని అతను కూడా అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ధర్మశాల వాతావరణం, పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి.

దీంతో భారత జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫీల్డింగ్ చేస్తుందని ఊహించారు. కానీ, కుల్దీప్‌కు ఆడే అవకాశం లభించడంతో అతను జట్టు అంచనాలను అందుకున్నాడు. ధర్మశాల టెస్టులో తొలిరోజు 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

100 ఏళ్లలో జరగని పనిని ధర్మశాలలో కుల్దీప్ యాదవ్ చేయడం విశేషం. నిజానికి, గత 100 ఏళ్లలో అతి తక్కువ బంతులు వేసి 50 వికెట్లు తీసిన పరంగా కుల్దీప్ మొదటి స్థానంలో నిలిచాడు. భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కుల్దీప్ 1871 బంతులు వేసి 50 వికెట్లు తీశాడు. కుల్దీప్ తన టెస్టు కెరీర్‌లో నాలుగోసారి 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

దీంతో చైనామాన్ బౌలర్ సుభాష్ గుప్తే, ఎరపల్లి ప్రసన్న, అక్షర్ పటేల్ వంటి భారత దిగ్గజాల సరసన చేరాడు. వేగంగా 50 టెస్ట్ వికెట్లు సాధించిన ఆరో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 50కి పైగా వికెట్లు తీసిన భారత్ నుంచి తొలి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్‌గా నిలిచాడు. టెస్టుల్లో కనీసం 50 వికెట్లు తీసిన బౌలర్లలో కుల్దీప్ రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు.

దీంతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన పాల్ ఆడమ్స్, ఇంగ్లండ్‌కు చెందిన జానీ వార్డెల్ తర్వాత టెస్టుల్లో 50 వికెట్లు తీసిన మూడో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కుల్దీప్ నిలిచాడు.

కాగా, ధర్మశాల టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 218 పరుగులు చేసింది. బెన్ డకెట్, ఒల్లీ పోప్, జాక్ క్రౌలీ, జానీ బెయిర్‌స్టో, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అదే సమయంలో, ఆర్ అశ్విన్ కూడా తన 100వ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు.




