- Telugu News Photo Gallery Cricket photos Shikhar Dhawan geared up for IPL 2024, Thumps 99 Not Out In DY Patil Tournament
IPL: పనికిరాడని పక్కనెట్టేశారు.. కట్ చేస్తే.. 51 బంతుల్లో రోహిత్ ఫ్రెండ్ ఊహకందని ఊచకోత..
ఈ ప్లేయర్ పనికిరాడని బీసీసీఐ పక్కనపెట్టేసింది. తమకు ఓపెనింగ్ బ్యాటర్లు వాళ్ల ముగ్గురే అని.. ఈ ప్లేయర్ ఇక రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చునని పరోక్షంగా అనేసింది. కట్ చేస్తే.. అవకాశాలు లేవు.. అయితేనేం.. రాబోయే ఐపీఎల్ 2024లో సత్తా చాటేందుకు డొమెస్టిక్ టోర్నమెంట్‌లో దుమ్ముదులిపాడు ఈ విధ్వంసకర ఓపెనర్.
Updated on: Mar 08, 2024 | 9:44 AM

ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ జూలు విదిల్చాడు. ముంబై వేదికగా జరుగుతోన్న డీవై పాటిల్ టోర్నీలో అదరగొట్టే ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. డీవై పాటిల్ బ్లూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న శిఖర్ ధావన్.. ఇటీవల సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన శిఖర్ ధావన్.. కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. గబ్బర్ విధ్వంసంతో డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

ఇంతటి అద్భుత ప్రదర్శన కనబరిచినా.. గబ్బర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. 183 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సీఏజీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వరుణ్ లవండే (70) అర్ధ సెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇదిలా ఉంటే.. గబ్బర్ తాజాగా ప్రదర్శనతో మిగతా ఐపీఎల్ టీంలు హడలెత్తిపోతుంటే.. పంజాబ్ ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీ చేసుకుంటోంది. వరుసగా రెండో సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు శిఖర్ ధావన్.

గత ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 373 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. ఇందులో 49 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అలాగే 3 అర్ధ సెంచరీలు, ఒక నైంటీ చేశాడు ధావన్.




