- Telugu News Photo Gallery Cricket photos IND Vs ENG 5th Test Team India Top 5 Batters Smashes 50 Plus Scores And Creates Unique Record After 15 Years
IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన.. టాప్ 5 ప్లేయర్స్ దెబ్బకు 15 ఏళ్ల రికార్డ్ రిపీట్..
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోజుకో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ కొన్ని రికార్డులు నమోదవుతాయి. అందుకు తగ్గట్టుగానే ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అరుదైన రికార్డు సృష్టించారు. దీంతో 15 ఏళ్ల తర్వాత ఓ స్పెషల్ రికార్డ్‌ను రిపీట్ చేశారు. అయితే, ఇది ఇంగ్లండ్‌పై తొలిసారి కావడం గమనార్హం.
Updated on: Mar 08, 2024 | 6:49 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోజుకో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ కొన్ని రికార్డులు నమోదవుతాయి. అందుకు తగ్గట్టుగానే ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు.

ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్ 5 బ్యాట్స్‌మెన్‌లు 50 పరుగులకు పైగా ఇన్నింగ్స్ ఆడారు. వీరిలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేయగా, యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ అర్ధశతకాలు సాధించారు.

టీమ్ ఇండియా టాప్ ఫైవ్ బ్యాట్స్ మెన్ 50కి పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

1998లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలిసారి ఈ ఫీట్ సాధించిన సమయంలో ఓపెనర్ వీవీఎస్ లక్ష్మణ్ 95, నవజ్యోత్ సింగ్ సిద్ధూ 97, రాహుల్ ద్రవిడ్ 86, సచిన్ టెండూల్కర్ 79, ఆ తర్వాత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 163 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత 6వ స్థానంలో వచ్చిన సౌరవ్ గంగూలీ కూడా 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆ తర్వాత 1999లో మళ్లీ అదే ఫీట్ రిపీట్ అయింది. ఈసారి మొహాలీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు నమోదైంది. జట్టు తరపున దేవాంగ్ గాంధీ 75, సదాగోపన్ రమేష్ 73, రాహుల్ ద్రవిడ్ 144, సచిన్ టెండూల్కర్ 126, సౌరవ్ గంగూలీ 64 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఆ తర్వాత మురళీ విజయ్ 87 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 293 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 74 పరుగులు, సచిన్ టెండూల్కర్ 53 పరుగులు, వీవీఎస్ లక్ష్మణ్ 62 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ 2009లో శ్రీలంకతో ముంబైలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఘటన చోటుచేసుకుంది. ఈసారి యశస్వీ జైస్వాల్ 57 పరుగులు, రోహిత్ శర్మ 103 పరుగులు, శుభ్‌మన్ గిల్ 110 పరుగులు, దేవదత్ పడిక్కల్ 65 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 56 పరుగులు చేశారు. అయితే, ఇంగ్లండ్‌పై భారత్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.




