Cyber Crime: ట్రెండింగ్ యాప్ ద్వారా లక్షలు సంపాదన.. విత్ డ్రా చేద్దామంటే ఇలా జరిగింది..
ఇటీవల ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దు అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రకరకాల ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా వాటి జోలికి వెళ్ళొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్‌కి చెందిన ఒక బాధితుడు ఇన్వెస్ట్మెంట్ యాప్ గురించి సోషల్ మీడియాలో ప్రకటన చూశాడు. తన మొబైల్ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి వాట్స్ ప్లో ఒక గ్రూపులో జాయిన్ అయ్యాడు.

అందులో ఇచ్చిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాడు. దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అయితే మొదటి కొన్ని రోజులు బాధితుడికి భారీ మొత్తంలో లాభాలను చూపించారు. రోజులు పెరుగుతున్న కొద్దీ బాధితుడు ఇన్వెస్ట్మెంట్ డబ్బు కూడా పెరుగుతూ వచ్చింది. ఒకేసారి తన ట్రేడింగ్ అకౌంట్లో 14.42 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకోవాలని భావించాడు. అయితే అప్పుడే నిందితులు విత్ డ్రా ఆప్షన్‌ను బ్లాక్ చేశారు. ఒకవేళ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే అదనంగా 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా టాక్స్ రూపంతో పాటు వచ్చిన లాభాలకు కమీషన్ అంటూ బాధితుడిను నమ్మించారు. దీనికి బాధితులు ఒప్పుకోకపోవటంతో అకౌంట్ మొత్తాన్ని బ్లాక్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ప్రజలందరూ ఫేక్ ట్రేడింగ్ యాప్ల్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ప్రభుత్వ ఏజెన్సీలు SEBI, NSC, BSC లో మాత్రమే ట్రేడింగ్ చేసుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని చిన్న లాజిక్స్‌ని ఉపయోగించి బాధితులను ట్రాప్ చేసేందుకు నేరగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో లాభాలు చూపిస్తామని కొన్ని స్క్రీన్ షాట్లను సైతం చూపించి బాధితులను మోసం చేసే ప్రమాదముంది. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను అసలు నమ్మవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సైబర్ బారిన పడి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. 1930 నంబర్ కు కాల్ చేసి ఎక్కడినుండి అయినా సరే జరిగిన నేరం గురించి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.