AP News: సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్నారా.? వందేభారత్ రైలు క్యాన్సిల్.. కారణమిదే.!

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు గమనిక. ముఖ్యంగా శుక్రవారం(మార్చి 8న) మహాశివరాత్రి రోజున విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ఈ అలెర్ట్. 20834 రైలు నెంబర్ గల సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు..

AP News: సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్నారా.? వందేభారత్ రైలు క్యాన్సిల్.. కారణమిదే.!
Vande Bharat Express
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 08, 2024 | 12:05 PM

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు గమనిక. ముఖ్యంగా శుక్రవారం(మార్చి 8న) మహాశివరాత్రి రోజున విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ఈ అలెర్ట్. 20834 రైలు నెంబర్ గల సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు పలు అనివార్య కారణాల వల్ల శుక్రవారం క్యాన్సిల్ అయిందని దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ ట్రైన్‌కు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తిగా వాపసు ఇస్తామన్నారు.  అయితే దీనికి ప్రయాణీకులు చింతించాల్సిన పన్లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఆ ట్రైన్ స్థానంలో 08134A నెంబర్‌తో సికింద్రాబాద్-విశాఖపట్నానికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ట్రైన్ ఉందన్నారు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. విశాఖపట్నానికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌కు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్‌లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. అయితే ఈ వందేభారత్ రైలు క్యాన్సిలేషన్ కారణంగా పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వందేభారత్‌తో కనెక్టింగ్ ట్రైన్స్‌కి వెళ్లేవారి పరిస్థితి ఏంటని.? ఇలా రైలు బయల్దేరే 6 గంటల ముందు ప్రకటించడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు.