నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు..
మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదుతో అడ్డ గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 18 మంది నిందితులపై హత్యా నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో అడ్డగూడూరు పోలీసులు చార్జిషీట్ వేశారు. ఈ కేసు నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టులో ట్రయల్స్ జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ హత్య కేసులో 18 మందికి జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో 2017 దసరా రోజున గ్రామంలో ఓ గొడవ జరిగింది. గ్రామానికి చెందిన బట్ట లింగయ్య అనే దళితుడు పూజ కోసం జమ్మిచెట్టు వద్దకు వచ్చాడు. అదే సమయంలో పండుగ రామస్వామి మరికొందరు కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ కులం పేరుతో దూషిస్తూ.. లింగయ్యపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన లింగయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.
మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదుతో అడ్డ గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 18 మంది నిందితులపై హత్యా నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో అడ్డగూడూరు పోలీసులు చార్జిషీట్ వేశారు. ఈ కేసు నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టులో ట్రయల్స్ జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో 18 మందికి జీవిత ఖైదుతోపాటు ఆరువేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు. ఈ కేసు ట్రయల్స్ సమయంలోనే నిందితుడు బిక్షమయ్య మృతి చెందాడు. మిగిలిన 17 మంది నిందితులను పోలీసులు జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: తొక్కే కదా అని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!
ఇది కూడా చదవండి: పెళ్లి ఊరేగింపులో దారుణం..! గుర్రంపై ఊరేగుతూ కుప్పకూలిన వరుడు.. షాకింగ్ వీడియో వైరల్..
ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్ పేలటంతో..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్ చేసేయండిలా..
ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..